E-Paper
Advertisement

Strait of Hormuz: ఇరాన్ యుద్ధం.. ఒక్కో నౌకలపై 18 కోట్లు ట్యాక్స్, ఆయిల్ ధరలు పెరగడం ఖాయం?

Strait of Hormuz: ఇరాన్ యుద్ధం.. ఒక్కో నౌకలపై 18 కోట్లు ట్యాక్స్, ఆయిల్ ధరలు పెరగడం ఖాయం?
Advertisement

Strait of Hormuz: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టి నాలుగో వారం నడుస్తోంది. గతంలో మాదిరిగా పగటి వేళ మిస్సైళ్ల దాడి లేవు. రాత్రి వేళ టపాసుల మాదిరిగా ఆకాశాల్లో మిస్సైళ్లు, డ్రోన్ల, బాంబుల శబ్దాలతో గల్ఫ్‌లోని వివిధ ప్రాంతాలు, ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలు మార్మోగుతున్నాయి. ఇప్పటివరకు ఇరాన్, గల్ఫ్ లోని పలు ప్రాంతాలు నాశనం అయ్యాయి. యుద్ధాన్ని మనీగా మార్చుకునే పనిలో పడింది ఇరాన్. గల్ప్ నుంచి వెళ్ల నౌకలకు భారీగా ట్యాక్స్ వసూలు చేయాలని ఇరాన్ డిసైడ్ అయినట్ట అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇరాన్ యుద్ధం.. హర్మూజ్‌ జలసంధి‌లో ట్యాక్స్

Advertisement

యుద్ధం తీవ్రం కావడంతో హర్మూజ్‌ జలసంధి‌ కీలకమైంది. దీనిపై ఇరాన్‌ ఏ మాత్రం పట్టు సడల్లేదు. ఈ నేపథ్యంలో 48 గంటలపాటు ఇరాన్‌కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. శత్రుదేశ నౌకలు మినహా మిగిలిన వాటిని అనుమతిస్తామని ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ వెల్లడించారు. మన భూభాగాన్ని ఉల్లంఘించే వారికి తప్ప, హోర్ముజ్ జలసంధి అందరికీ తెరిచి ఉంటుందని ఎక్స్ వేదికగా ఆయన పోస్టు చేశారు.

అయితే జలసంధిని దాటేందుకు షిప్ నుంచి 2 మిలియన్‌ డాలర్ల చొప్పున ఫీజు వసూలుచేయడం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని ఇరాన్‌ పార్లమెంట్‌ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సభ్యుడు బరూజెర్ది వెల్లడించినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. ఒక విధంగా చెప్పాలంటే యుద్ధంలో ఇరాన్ ఏ మాత్రం పట్టుసడల్లేదు.

Advertisement

ఒక్కో నౌకపై రూ. 18 కోట్లు పన్ను విధించిన ఇరాన్

పైగా తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. యుద్ధం నేపథ్యంలో ఖర్చులు పెరగడంతో వసూలు చేయాల్సివస్తోందని పేర్కొన్నారు. అమెరికా తన బెదిరింపులను అమలు చేస్తే హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసి వేస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. మిత్ర దేశాల రాకపోకలను తాము అనుమతి ఇస్తున్నామని టెహ్రాన్ చెబుతోంది.

ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు హోర్ముజ్ జలసంధి ద్వారా జరుగుతోంది. అక్కడ ఏ చిన్న అంతరాయం ఏర్పడినా ప్రపంచ ఇంధన మార్కెట్లలో ధరలు భగ్గుమనడం ఖాయం. ఈ లెక్కన వివిధ దేశాల్లో ఆయిల్, గ్యాస్ ధరలు పెరగడం ఖాయమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: ఇరాన్ వార్.. మరొక సెక్టార్‌కు సెగ, అన్నిదేశాలకు దెబ్బ 

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×