BigTV English

Israel-Iran War: ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడులు.. 24 మంది మృతి.. విమానాలు రద్దు చేసిన ఇరాన్

Israel-Iran War: ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడులు.. 24 మంది మృతి.. విమానాలు రద్దు చేసిన ఇరాన్

Israel-Iran War Tehran lifts flight restrictions: ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడులకు పాల్పడింది. గత కొద్ది రోజులుగా లెబనాన్, ఇరాన్‌పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ తిరిగి గాజా మీద దృష్టి సారించింది. హమాస్‌ను లక్ష్యంగా చేసుకొని బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 24 మంది దుర్మరణం చెందారు. అదే విధంగా 94 మంది తీవ్రంగా గాయపడినట్లు హమాస్ తెలిపింది.


ఇటీవల లెబనాన్, ఆ వెంటనే ఇరాన్‌పై ఇజ్రాయెల్ వరుస దాడుల చేసింది. ఈ రెండు దేశాలు తనపై యుద్ధానికి దిగడంతో ప్రతిదాడులు చేసింది. హెజ్బొల్లా స్థావరాలు, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ బలగాలను టార్గెట్ చేసింది. ఇటీవల లెబనాన్‌లో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా దారుణ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై దండెత్తిన విషయం తెలిసిందే.

ఇజ్రాయెల్ దేశ కాలమానం ప్రకారం.. తెల్లవారుజామున సెంట్రల్ గాజాలో ఉన్న దాయిరా అల్ బలాహ్‌లోని హమాస్ స్థావరాలపై భారీగా బాంబులో దాడి చేసింది. మిస్సైళ్లను సైతం సంధించడంతో 24 మంది మృతి చెందారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.


అయితే ఈ దాడి విషయాన్ని హమాస్ ధృవీకరించింది. మసీదు, పక్కనే ఉన్న ఓ స్కూల్ పై ఇజ్రాయెల్ దాడికి పాల్పడినట్లు ఆరోపించింది. దాయిరా అల్ బలాహ్ ప్రాంతంలోని అల్ అక్సా ఆస్పత్రి సమీపంలో ఉన్న ఇబిన్ రుషద్ స్కూల్, షుహుద అల్ అక్సా మసీదు ధ్వంసం అయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా, అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలలో తలదాచుకున్న వారిపై ఇజ్రాయెల్ దాడి చేసిందని హమాస్ విమర్శలు చేసింది.

Also Read: ట్రంప్ ర్యాలీలో మస్క్ మామ డ్యాన్స్.. ఇలా తయారయ్యావేంటి సామి

ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ విమానా సర్వీసులను రద్దు చేసింది. ఇరాన్ కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 9గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు అంతరాయం ఉంటుందని ప్రకటించింది. అలాగే లెబనాన్ సైతం రాజధాని బీరుట్ నుంచి అన్ని విమానాలను రద్దు చేసింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×