BigTV English

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలు పెట్టిన టారిఫ్ వార్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పన్నులు విధించడంలో ట్రంప్ ని మించినోళ్లు లేరు అనే మాట వినపడుతోంది. ఏకంగా భారత్ పై 50 శాతం సుంకాలు విధించి తన పంతం నెగ్గించుకున్నారాయన. అయితే పన్నులు విధించడంలోనే కాదు, తెలివిగా పన్ను ఎగ్గొట్టడంలో కూడా ట్రంప్ నేర్పరి అని తెలుస్తోంది. ఆయనకి సంబంధించిన ఓ ఆసక్తికర కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ట్రంప్ ఎవరికి పన్ను ఎగ్గొట్టారు, ఎందుకు అలాంటి మోసం చేశారు..?


మొదటి భార్య మరణం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ముగ్గురు భార్యలు, ఐదుగురు పిల్లలు. ఆయన మొదటి భార్య పేరు ఇవానా, రెండో భార్య మార్లా, మూడో భార్య మెలానియా. అయితే ఈ ముగ్గురిలో మొదటి భార్య ఇవానా పేరు ఇప్పుడు వార్తల్లోకెక్కింది. ఆమె మరణాన్ని ట్రంప్ తన స్వలాభం కోసం ఎలా వాడుకున్నాడో చెప్పే కథనం అది. 2022లో ట్రంప్ మొదటి భార్య చనిపోయారు. ఆమె శవాన్ని శ్మశాన వాటికలో కాకుండా, తన గోల్ఫ్ కోర్స్ స్థలంలో పాతి పెట్టారు ట్రంప్. అప్పట్లో ట్రంప్ చేసిన పనిని అందరూ మెచ్చుకున్నారు. భార్యపై ఎంత ప్రేమ ఉంటే తన గోల్ఫ్ కోర్స్ లో ఆమెని ఖననం చేస్తారని అనుకున్నారంతా. అప్పటికే ఆమెతో విడాకులు తీసుకున్నా కూడా ఆమె దహన సంస్కారాలకు గోల్ఫ్ కోర్స్ ని ఉపయోగించారని ఆయనది ఎంతో దయార్ధ్ర హృదయం అని ఆకాశానికెత్తేశారు. అయితే అందులో చిన్న మతలబు ఉంది. ట్రంప్ ఏది చేసినా ముందు చూపుతో చేస్తారు, భార్య మరణం విషయంలో కూడా ఆయన ముందు చూపు కాస్త ఆలస్యంగా బయటపడింది.

పన్ను ఎగ్గొట్టేందుకు..?
ట్రంప్ తన మొదటి భార్య ఇవానాకు సమాధి కట్టిన గోల్ఫ్ కోర్స్ న్యూజెర్సీలో ఉంది. న్యూజెర్సీ స్థానిక చట్టాల ప్రకారం శ్మశాన వాటికలపై పన్ను లేదు. అందుకే తన గోల్ఫ్ కోర్స్ ని శ్మశాన వాటికలా మార్చారు ట్రంప్. తన భార్య శవాన్ని మాత్రమే అక్కడ పాతి పెట్టారు. పోనీ నిజంగానే భార్యపై ప్రేమ ఉంటే ట్రంప్ ఆ ప్రాంతాన్ని ఒక స్మారకంగా మార్చేవారు. కానీ గోల్ఫ్ కోర్స్ లో ఓ మూల ట్రంప్ భార్య శ్మశానం ఉంటుంది. అక్కడ చిన్న రాయిపై ఆమె వివరాలు రాసి ఉంటాయి. అసలు అక్కడ సమాధి ఉన్నట్టు కూడా అనిపించదు. అంటే కేవలం ట్రంప్ పన్ను రాయితీ కోసం తన గోల్ఫ్ కోర్స్ లో భార్య శవాన్ని ఖననం చేసినట్టు చెబుతున్నారు. “ఆస్తి పన్ను లేదు. అమ్మకం పన్ను లేదు, ఆదాయపు పన్ను లేదు.” అందుకే ట్రంప్ గోల్ఫ్ కోర్స్ ని శ్మశాన వాటికలా మార్చేశారు. ఒకే ఒక్క సమాధితో గోల్ఫ్ కోర్స్ కి పన్ను మినహాయింపు తెచ్చుకున్నాడు.


ట్రంప్ మామూలోడు కాదు..
ట్రంప్ భార్య చనిపోవడం, ఆమె అంత్యక్రియలు.. అంతా గతం. కానీ ఇప్పుడు ఈ విషయం హైలైట్ అవుతోంది. అంతర్జాతీయంగా టారిఫ్ వార్ మొదలు పెట్టిన ట్రంప్, నీతి నిజాయితీ గురించి అందరికీ క్లాస్ పీకుతుంటాడు. పన్నులు పెంచకపోవడం వల్ల అమెరికా నష్టపోయిందని కూడా చెబుతుంటాడు. కానీ ట్రంప్ లాంటి ధనవంతులు కూడా పన్ను మినహాయింపులకోసం ప్రభుత్వాలను ఎలా మోసం చేస్తుంటారో చెప్పే ఉదాహరణ ఇది. గోల్ఫ్ కోర్స్ లో భార్య శవాన్ని పాతి పెట్టి ఆ ప్రాంతానికి పన్ను లేకుండా చేసుకున్నారు ట్రంప్. అమెరికాలో చాలామంది ధనవంతులు పన్నులు ఎగ్గొట్టేందుకు ఇలానే చేస్తుంటారని తెలుస్తోంది. ట్రంప్ కూడా దీనికి మినహాయింపు కాదు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×