E-Paper
Advertisement

Italy Landslide: భయానకం.. ఒకేసారి లోయలోకి జారిన వందలాది ఇళ్లు.. వణికించే వీడియో

Italy Landslide: భయానకం.. ఒకేసారి లోయలోకి జారిన వందలాది ఇళ్లు.. వణికించే వీడియో
Advertisement

Italy Landslide: ఇటలీలో కొండ చరియలు జారిపడి ఒకే ఊరే లోయలో కలిసిపోయింది. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రకృతి విధ్వంసానికి ఇదొక ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటలీలోని సిసిలియన్ పట్టణం నిస్సెమిలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భారీ విధ్వంసం సంభవించింది. కొండపై ఉన్న ఊరులోని ఇళ్లు ఒకదాని తర్వాత ఒకటి లోయలోకి జారీ పడ్డాయి. ఈ దిగ్భ్రాంతికరమైన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్థానిక యంత్రాంగం ముందుగానే 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీనివల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.

వీడియోలు వైరల్

హ్యారీ తుపాను తీవ్రమైన వాతావరణం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కొండ అంచున ఉన్న ఇళ్లు కొట్టుకుపోయాయి. మరిన్ని ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. స్థానిక వార్తా సంస్థలు, వీడియో ప్రకారం.. కొండ ఎత్తున పగుళ్లు వచ్చి, రాళ్లు జారిపోవడం, ఇళ్లు లోయలో పడిపోవడం కనిపిస్తుంది. కొన్ని భవనాలు ఇప్పటికే పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దెబ్బతిన్న ఇళ్ల లోయలోకి వేలాడుతున్నాయి. లోయలోకి ఇళ్లు జారిపోతున్న వీడియోలు ప్రకృతి విధ్వంసానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.

Advertisement

మరిన్ని ప్రాంతాలకు అలర్ట్

మేయర్ మాసిమిలియానో ​​కాంటి మాట్లాడుతూ… స్థానికులను ప్రమాదం గురించి ముందే అలర్ట్ చేశామన్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతం చుట్టూ అధికారులు రెడ్ జోన్‌ను ప్రకటించారు. ప్రజలెవ్వరూ ఈ ప్రాంతాలకు వెళ్లకుండా నిషేధించారన్నారు. ముందుజాగ్రత్తగా కొండ ప్రాంతాలలో 100 నుండి 150 మీటర్లకు వరకు ప్రజలను అనుమతించడంలేదు. భూభాగంలో కదలికలు పట్టణ కేంద్రం వైపు నాలుగు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్నాయని మేయర్ అన్నారు. దీంతో మరిన్ని ఇళ్లు ప్రమాదంలో ఉన్నాయని చెప్పారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో… నిస్సేమిలో మరిన్ని ప్రాంతాల్లోని ప్రజలను తరలిస్తున్నామని అధికారులు తెలిపారు.

హ్యారీ తుపాను బీభత్సం

Advertisement

గత వారం విధ్వంసం సృష్టించిన హ్యారీ తుపాను ప్రభావంతో.. నిస్సేమిలో కొండచరియలు విరిగిపడుతున్నాయని అధికారులు అంటున్నారు. దక్షిణ ఇటలీలోని కాలాబ్రియా, సిసిలీ, సార్డినియాలలో భూమిలో భారీగా కదలికలు చోటుచేసుకున్నాయని అంటున్నారు.

Also Read:  కాశ్మీర్ మంచు ఢిల్లీలో అమ్మకం, ఆ కుర్రాడి ఆలోచన మామూలుగా లేదు, వీడియో వైరల్

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×