Big Stories

Jack Dorsey Blue Sky : ట్విట్టర్‌కు ధీటుగా బ్లూస్కై.. త్వరలో లాంచ్..

- Advertisement -

ట్విట్టర్ సీఈవో బాధ్యతల నుంచి జాక్ డార్సీ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ స్థానంలో పరాగ్ అగర్వాల్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేసిన తరువాత అందులో అనేక మార్పులు జరుగనున్నాయి. పరాగ్ అగర్వాల్‌ను ఇప్పటికే సీఈవో స్థానం నుంచి తొలగించారు మస్క్. బ్లూస్కై నిజంగా ట్విట్టర్‌కు గట్టి పోటీ ఇస్తుందా.. వేచి చూడాల్సిందే.

- Advertisement -

Jack Dorsey Blue Sky : ప్రస్తుతం నడుస్తుంది డిజిటల్ యుగం.. ఇప్పుడంతా సోషల్ మీడియా, యాప్స్, వెబ్సైట్స్, ఇంటర్నెట్‌దే హవా.. ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే ట్విట్టర్‌కు ధీటుగా.. పోటీగా ‘బ్లూస్కై’ అనే సోషల్ నెట్వర్క్ ప్లాట్‌ఫార్మ్‌ను స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ బ్లూస్కై పబ్లిక్ బీటా టెస్టింగ్‌లో ఉందని చెప్పారు.

అథెంటికేటెడ్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్‌పై బ్లూస్కై పనిచేస్తందని జాక్ డోర్సే తెలిపారు. సోషల్ మీడియా నెట్వర్క్‌ల వెనుక ఉన్న అసలు లక్ష్యాన్ని ఈ బ్లూస్కై చేధిస్తుందని చెప్పారు. యూజర్ల డేటాను కూడా ఇది హస్తగతం చేసుకోగలుగుతుందన్నారు. అయితే ఒక సైట్ నుండి కాకుండా పలు సైట్ల నుంచి దీన్ని నడపాల్సి ఉంటుందని జాక్ డార్సే తెలిపారు. ట్విట్టర్‌కు బ్లూస్కై గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ట్విట్టర్ సీఈవో బాధ్యతల నుంచి జాక్ డార్సీ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ స్థానంలో పరాగ్ అగర్వాల్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేసిన తరువాత అందులో అనేక మార్పులు జరుగనున్నాయి. పరాగ్ అగర్వాల్‌ను ఇప్పటికే సీఈవో స్థానం నుంచి తొలగించారు మస్క్. బ్లూస్కై నిజంగా ట్విట్టర్‌కు గట్టి పోటీ ఇస్తుందా.. వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News