Big Stories

Gujarath Morbi Bridge : మోర్బీ బ్రిడ్జ్ దుర్ఘటనలో పెరుగుతోన్న మృతుల సంఖ్య..

Gujarath Morbi Bridge : వంతెన కూలిన ఘటనను గుజరాత్‌ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనతో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్‌ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి హర్ష్‌ సంఘ్వీ తెలిపారు. దీంతోపాటు ఐదుగురు సభ్యుల కమిటీ ప్రమాదానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తుందన్నారు.

- Advertisement -

మోర్బీ నగరంలోని వేలాడే వంతెనకు 7 నెలలపాటు మరమ్మతుల నిర్వహించి.. గుజరాతీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ నెల 26న దాన్ని తిరిగి తెరిచారు. దీపావళి సెలవులకు తోడు ఆదివారం కూడా కావడంతో ఈ వంతెన వద్ద పర్యాటకుల రద్దీ బాగా కనిపించింది. వంతెనపైకి వందల మంది చేరారు. సందర్శకుల సంఖ్య మరీ ఎక్కువ కావడంతో.. అధిక బరువును మోయలేక ఆదివారం సాయంత్రం వంతెన ఒక్కసారిగా కూలిపోయింది.

- Advertisement -

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News