Big Stories

Chhath Puja Celebrations : దేశవ్యాప్తంగా ఘనంగా ఛాట్ పూజలు..

Chhath Puja Celebrations : దేశవ్యాప్తంగా ఛట్ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానంగా ఉత్తరాదిన యూపీ, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి.

- Advertisement -

ఏటా కార్తీకమాసంలో ఛట్ పూజ నిర్వహిస్తుంటారు. ఛట్ పూజను దళ ఛట్, ఛతి, సూర్య షష్ఠి అని కూడా అంటారు. మన ప్రాచీన పండుగల్లో ఛట్ పూజ ఒకటి. సూర్యభగవానుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆయురారోగ్య, ఆనందాలను ప్రసాదించమని పూజను నిర్వహిస్తారు. సూర్యున్ని ఆరాధించడం వల్ల పలు వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News