E-Paper
Advertisement

North Korea Successor: ఉత్తర కొరియా బాధ్యతలను కూతురికి అప్పగించనున్న కిమ్ మామ? చెల్లి ఊరుకుంటుందా?

North Korea Successor: ఉత్తర కొరియా బాధ్యతలను కూతురికి అప్పగించనున్న కిమ్ మామ? చెల్లి ఊరుకుంటుందా?
Advertisement

North Korea Successor: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జు ఏను తన వారసురాలిగా దాదాపు ఖరారు చేసినట్లు దక్షిణ కొరియా నిఘా సంస్థ (NIS) అంచ‌నా వేసింది. కిమ్ జు ఏ ప్రస్తుతం 13 ఏళ్ల వయస్సులో ఉండవచ్చని భావిస్తున్నారు. ఆమెను వారసురాలిగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా నిఘా సంస్థ గతంలో “Successor Training” అనే పదాన్ని వాడగా, ఇప్పుడు దానిని “Successor-Designate Stage” (వారసురాలిగా నిర్ణయించిన దశ) గా మార్చిన‌ట్లు స‌మాచారం.

ఈ నెలాఖరులో జరగనున్న ఉత్తర కొరియా వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ సమావేశంలో కిమ్ జు ఏ ప్రాముఖ్యత మరింత పెరిగే అవకాశం ఉంది. వేల సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యే ఈ సభలో ఆమె తండ్రి పక్కన కనిపిస్తుందా లేదా అనేది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. గత సెప్టెంబర్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో కిమ్ జరిపిన శిఖరాగ్ర సమావేశంలో కూడా ఆమె తండ్రితో కలిసి ప్రయాణించడం, ఆమె హోదాను సూచించే బలమైన సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

ఉత్తర కొరియాలో పురుషాధిక్య నాయకత్వ సంప్రదాయం ఉన్నప్పటికీ, ప్రభుత్వ మీడియాలో ఆమెకు లభిస్తున్న ప్రాధాన్యత కారణంగా దక్షిణ కొరియా అధికారులు కూడా తమ పాత అంచనాలను మార్చుకుంటున్నారు. కిమ్ జోంగ్ ఉన్ అతి తక్కువ సమయంలోనే అధికార పగ్గాలు చేపట్టాల్సి రావడంతో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, తన కుమార్తెను ముందుగానే వారసురాలిగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ వేదికగా కిమ్ తన కుమార్తెకు పార్టీలో అత్యంత కీలకమైన ‘ఫస్ట్ సెక్రటరీ’ (నంబర్ 2 పదవి) హోదాను కట్టబెట్టే అవకాశం ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అయితే, పార్టీ నిబంధనల ప్రకారం సభ్యులకు 18 ఏళ్ల వయస్సు ఉండాలి కాబట్టి, ఆమెకు అధికారిక పదవి ఇవ్వకపోయినా, ఆమె వారసత్వాన్ని బలపరిచేలా ‘విప్లవ వారసత్వం విజయవంతమైంది’ వంటి ప్రశంసలను పార్టీ తీర్మానాల్లో చేర్చే అవకాశం ఉంది.

Advertisement

ఉత్తర కొరియా వారసత్వ పరిణామాల్లో కిమ్ జోంగ్ ఉన్ సోదరి, కిమ్ యో జోంగ్ (Kim Yo Jong) పాత్ర అత్యంత కీలకం. ఆమె తన అన్నయ్య కుమార్తె వారసత్వాన్ని అడ్డుకునే అవకాశం ఉందా అనే దానిపై నిపుణుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఒకవేళ కిమ్ జు ఏను అధికారికంగా వారసురాలిగా ప్రకటిస్తే, కిమ్ యో జోంగ్ తన ప్రాధాన్యత తగ్గుతుందని భావించే అవకాశం ఉంది. సంప్రదాయబద్ధమైన ఉత్తర కొరియా సమాజంలో అధికారం కోసం కుటుంబ సభ్యుల మధ్య అంతర్గత పోరు జరిగే అవకాశాలను తోసిపుచ్చలేమని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: PoK Map Issue: పీవోకే మాదే.. యూఎస్ ముందు పాక్ పేచీ, ఆ మ్యాప్ చూసి గగ్గోలు

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×