E-Paper
Advertisement

Mini Indias : విదేశాల్లో మినీ ఇండియాలివే..!

Mini Indias : విదేశాల్లో మినీ ఇండియాలివే..!
Advertisement
Mini Indias

Mini Indias : ప్రపంచంలో ఏ మూలకెళ్లినా భారత్‌ ప్రభావం ఉంటుంది. అచ్చంగా మన సంస్కృతీ, సంప్రదాయాలూ, రుచులతో ‘మినీ ఇండియా’లుగా పేరు తెచ్చుకున్న కొన్ని ప్రదేశాలున్నాయి. ప్రవాస భారతీయ దివస్ సందర్భంగా అలాంటి కొన్ని ప్రదేశాల వివరాలను తెలుసుకుందాం.

మీనా బజార్, దుబయ్: భారత్ నుంచి వచ్చిన దుస్తులు, భారతీయ ఆహారం లభించే రెస్టారెంట్లున్న ఈ ప్రాంతాన్ని దుబయ్ వచ్చిన భారతీయులంతా సందర్శిస్తారు.

  • సౌతాల్‌, లండన్‌: ఈ మహానగరంలో సుమారు 60 వేల మంది భారతీయులుండే సౌతాల్‌లో అనేక ఆలయాలతో బాటు గురుద్వారా కూడా ఉంది. మినీ ఇండియాగా పిలిచే సౌతాల్‌లో జరిగే దీపావళి, హోలీ వేడుకలకు చాలా గొప్ప పేరుంది.
Advertisement

బ్రిక్ ఫీల్డ్స్, కౌలాలంపూర్‌: మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లోని బ్రిక్‌ఫీల్డ్స్‌ ప్రాంతానికి లిటిల్‌ ఇండియా అని పేరు. ఇక్కడి స్థానికుల్లో అత్యధికులు భారతీయ మూలాలున్నవారే. భారత్‌లో దొరికే ప్రతి వస్తువూ ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడి వీధుల్లో నడుస్తుంటే.. ముంబై, ఢిల్లీలో ఉన్నట్లే అనిపిస్తుంది.

డెవాన్‌ ఎవెన్యూ, షికాగో: అమెరికాలోని షికాగో నగరంలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్తే పెద్ద ఎత్తున భారతీయ రెస్టరెంట్లే కాదు… చీరల దుకాణాలూ అత్యధికంగా ఉంటాయి.

Advertisement

లిటిల్‌ ఇండియా, సింగపూర్‌: అడగడుగునా భారతీయ సంస్కృతి కనిపించే ఈ ప్రాంతంలో బోలెడన్ని భారతీయ రెస్టరెంట్లూ, దుకాణ సముదాయాలున్నాయి. షాపింగ్‌తో బాటు నోరూరించే భారతీయ రుచులకూ ఈ ప్రాంతం చాలా ఫేమస్.

రూ దు ఫాబొ, ప్యారిస్‌: ఫ్యాషన్‌ ప్రపంచంగా చెప్పే ప్యారిస్‌ చూసేందుకు వెళ్లే భారతీయులంతా తప్పనిసరిగా సందర్శించే ప్రాంతం రూ దు ఫాబొ. అక్కడ నివసించే భారతీయులకు అవసరమైన దేశీ సరుకులకే గాక ప్యారిస్‌ ఫ్యాషన్లు అద్దిన దుస్తులకూ ఈ ప్రాంతం ప్రసిద్ధి.

Related News

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

Big Stories

Advertisement
×