E-Paper
Advertisement

Trump: అమెరికాకు ఇజ్రాయెల్ హెచ్చరిక.. ట్రంప్‌ను చంపేందుకు మాస్టర్ ప్లాన్ వాళ్లదే

Trump: అమెరికాకు ఇజ్రాయెల్ హెచ్చరిక.. ట్రంప్‌ను చంపేందుకు మాస్టర్ ప్లాన్ వాళ్లదే
Advertisement

Trump: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం మళ్లీ తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడిచిన రెండురోజులుగా ఆ రెండు దేశాల మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పిడుగులాంటి వార్త బయట పెట్టింది. ట్రంప్‌ను హతమార్చేందుకు ఇరాన్ ప్లాన్ చేసిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు గుప్పుమన్నాయి.

అమెరికాకు ఇజ్రాయెల్ హెచ్చరిక

Advertisement

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్‌ పన్నిన కుట్రలను ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలు పసిగట్టాయి. నిఘా వర్గాల సమాచారాన్ని వాషింగ్టన్‌తో ఇజ్రాయెల్ పంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గడిచిన రెండురోజులు ఆ దేశాల మధ్య జరుగుతున్న మళ్లీ ఘర్షణల నడుమ ఇజ్రాయెల్‌ నిఘా వర్గాల నివేదిక సంచలనం రేపుతోంది.

దీంతో యుద్దం తీవ్రతరం కావడం ఖాయమనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఘటనలను ట్రంప్.. నెతన్యాహుకు వివరించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని ఆఫీసు తెలిపింది. దీనికి సంబంధించి నెతన్యాహుకు ట్రంప్ సమాచారం ఇచ్చినట్టు పత్రికలు ప్రస్తావించాయి.

Advertisement

ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్ మాస్టర్ ప్లాన్-ఇజ్రాయెల్ నిఘా వర్గాలు

2020లో ఇరాన్ ఐఆర్‌జీసీ జనరల్ ఖాస్సెమ్ సులేమానీని హతమార్చినప్పటి నుండి ట్రంప్‌ను హత్య చేస్తామని ఇరాన్ బహిరంగంగా చెబుతోంది. ఇరాన్ సుప్రీం దివంగత అయతుల్లా అలీ ఖమేనీ జరుగుతున్న సంతాప కార్యక్రమాల్లో అమెరికా అధ్యక్షుడి మరణానికి పిలుపులు ప్రముఖంగా వినిపిస్తున్నాయని ఆయా పత్రికలు పేర్కొన్నాయి.

ఆ సమాచారం ఒక నిర్దిష్ట కుట్రకు సంబంధించినది కాదని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడిని హత్య చేసే అంశంపై ఇరాన్ అధికారుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించినదని ఇద్దరు అమెరికా అధికారులు ఓ వార్తా సంస్థకు తెలిపారు.

ALSO READ: స్పెయిన్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు.. 12 మంది సజీవదహనం

టర్కీలో జరిగిన నాటో సమావేశంలో తనపై జరుగుతున్న హత్య కుట్రల గురించి ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిని అడ్డు తొలగించాలని వారు కోరుకుంటున్నారని, తాను హిట్‌ లిస్ట్‌లో ఉన్నానని తెలిపారు. ఇప్పటివరకు తాను అదృష్టవంతుడినేనని, బహుశా ఎక్కువ కాలం నిలవదన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత టర్కీ నుంచి బయలుదేరినప్పుడు మళ్లీ పాత విమానాన్ని వినియోగించారు ట్రంప్.

అమెరికా అధ్యక్షుడి కోసం ఖతార్‌ ఓ విమానాన్ని గిఫ్ట్‌గా ఇచ్చింది. అప్పటి నుంచి ట్రంప్‌ అందులో ట్రావెల్ చేసేవారు. నాటో సదస్సుకు హాజరైనప్పుడు దాన్ని వినియోగించారు. కాకపోతే తిరిగి వెళ్లే సమయంలో పాత ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో ప్రయాణించడం ఇప్పుడు ఈ అంశంపై చర్చ మొదలైంది.

Related News

హెచ్-1బీ వీసా కొత్త రూల్స్ రెడీ.. ఫీజు లక్ష డాలర్లు పైనే.. జాబ్ పోతే తక్షణం దేశం వీడాల్సిందే!

రిటైర్డ్‌ టీచర్‌ ఫ్యామిలీని చంపి.. ఏడుగంటపాటు ఇంట్లో నిందితులు, బంగ్లాదేశ్‌లో దారుణం

కూతురు కళ్ల ముందే.. భారత వ్యాపార‌వేత్త కాల్చివేత, అమెరికా దారుణమైన ఘటన

జపాన్‌ను వణికించిన భారీ భూకంపం.. భయాందోళనలో టోక్యోవాసులు, పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిపివేత

వరల్డ్‌ ఫేమస్ వ్యక్తులు.. చనిపోయినా వదల్లేదు.. సమాధులు తవ్వి శరీర భాగాలు ఎత్తుకెళ్లారు!

భారీ రాళ్లను అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారో తెలిస్తే దిమ్మతిరుగుద్ది.. పిరమిడ్ల నిర్మాణ సీక్రెట్ ఇదే!

కుప్పకూలిన బంగారు గని, 100 మందికి పైగా మృతి! ఇంతకీ ఎక్కడో తెలుసా?

ఆపరేషన్ బార్బరోస్సా.. హిట్లర్ చేసిన ఆ ఒక్క పొరపాటే రెండో ప్రపంచ యుద్ధ ఫలితాన్ని మార్చేసిందా?

Big Stories

Advertisement
×