E-Paper
Advertisement

వియత్నాంలో ఘోర ప్రమాదం.. సముద్రంలో బోల్తా పడిన బోటు.. 18 మంది భారతీయ పర్యాటకులు మృతి!

వియత్నాంలో ఘోర ప్రమాదం.. సముద్రంలో బోల్తా పడిన బోటు.. 18 మంది భారతీయ పర్యాటకులు మృతి!
Advertisement

Vietnam: వియత్నాంలో పర్యటనకు వెళ్లిన భారతీయ పర్యాటకులను భారీ విషాదం ముంచెత్తింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫు క్వాక్ దీవి సమీపంలో పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు సముద్రంలో బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో 18 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఒక ప్రముఖ మొబైల్ కంపెనీకి చెందిన డీలర్ల విహారయాత్రలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకోవడం వ్యాపార వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది.

అసలేం జరిగింది?

Advertisement

సదరు మొబైల్ కంపెనీ ప్రతినిధులు, వ్యాపార భాగస్వాముల కోసం ఏర్పాటు చేసిన ఈ విహారయాత్రకు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున డీలర్లు వెళ్లారు. మొత్తం 250 మంది సభ్యుల బృందంలో ఏపీ నుంచి 35 మంది, తెలంగాణ నుంచి 40 మంది ఉన్నారు. ట్రిప్‌లో భాగంగా వారు హాన్ మే రట్ ప్రాంతం నుండి ఆన్ తోయ్ పోర్టుకు బోటులో బయలుదేరారు. అయితే, పోర్టుకు కేవలం 400 మీటర్ల దూరంలో ఉండగా సముద్రంలో అలల ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. అలల దాటికి తట్టుకోలేక బోటు అదుపుతప్పి సముద్రంలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో ఆ బోటులో సుమారు 70 మందికి పైగా టూరిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: అత్తమామలను కారుతో తొక్కించేసిన అల్లుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Advertisement

కలచివేస్తున్న దృశ్యాలు.. ముమ్మరంగా సహాయక చర్యలు

సమాచారంతో అందుకున్న రెస్క్యూటీమ్స్ సకాలంలో స్పందించారు.  సముద్రం నుండి ఇప్పటివరకు 21 మందిని సురక్షితంగా బయటకు తీశాయి. ఘటనా స్థలంలో లభ్యమవుతున్న మృతదేహాల దృశ్యాలు చూసేవారిని కలచివేస్తున్నాయి. మృతుల్లో కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ తమిళనాడుకు చెందిన సెంథిల్ కుమార్, మురుగ ప్రభు, సుందరరాజన్ శ్రీధర్, షేక్ అబ్దుల్లా, బాలాజీ, వినయ కుమార్, రవిశంకర్, సంతోష్ కుమార్, బాబు, అలగురజన్, కేరళంకు చెందిన చెరియన్ థామస్, లోవెని థామస్ ఉన్నారు. గల్లంతైన మిగిలిన వారి కోసం వియత్నాం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

భారత ఎంబసీ అలర్ట్.. హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు

ఈ దుర్ఘటనపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) తక్షణమే స్పందించింది. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించడానికి హనోయ్, హో చి మిన్ నగరాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది.

బాధితుల సమాచారం కోసం (+84 36 281 7930, +84 91 552 3714, +84 33 452 0414) హెల్ప్‌లైన్ నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

Related News

అతిపెద్ద చమురు సంస్థ అరామ్కోపై క్షిపణి దాడి.. హౌతీ దూకుడుతో సౌదీకి వణుకు

తన బొమ్మలకు పని చెప్పిన కిమ్.. క్షిపణులతో డిష్యుం డిష్యుం.. పొరుగు దేశాల్లో కలవరం!

ఫ్లైట్ కోసం ఎదురుచూస్తుంటే.. తలపై పడ్డ బాంబు, ఇండియన్స్‌తో పాటు 13 మంది…

భూమికి సౌర తుఫాను ముప్పు.. ఉపగ్రహాలు- జీపీఎస్ వ్యవస్థల మాటేంటి? రాత్రికి ఆకాశంలో ఏం జరుగుతోంది?

నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు.. సల్లేరి బజార్‌ను ముంచెత్తిన ప్రళయం, అధికారులు హెచ్చరిక జారీ

రియాద్ ఎయిర్‌పోర్టుపై హౌతీల మెరుపుదాడి, 12 మంది మృతి, అలర్టయిన అమెరికా

అమెరికాలో కాల్పుల కలకలం.. గర్భిణి, పిల్లలు సహా 9 మంది మృతి!

కుప్పకూలిన నెట్‌వర్క్‌లు, మూతపడ్డ ఎయిర్‌పోర్ట్.. పనామాలో మహా విపత్తు!

Big Stories

Advertisement
×