E-Paper
Advertisement

Helicopter Crash: అమెరికాలో రెండు హెలికాప్టర్లు ఢీ.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు, ఒకరు మృతి

Helicopter Crash: అమెరికాలో రెండు హెలికాప్టర్లు ఢీ.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు, ఒకరు మృతి
Advertisement

Helicopter Crash: అమెరికాలోని న్యూజెర్సీలోని హామన్ టన్ ప్రాంతం సమీపంలో.. గాల్లో ప్రయాణిస్తున్న రెండు హెలికాప్టర్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే, హెలికాప్టర్లు గాల్లోనే పూర్తిగా నియంత్రణ కోల్పోయి ఢీకొన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Advertisement

ప్రమాదం జరిగిన వెంటనే హామన్ టన్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. హెలికాప్టర్లు ఢీకొన్న సమయంలో భారీగా మంటలు చెలరేగడంతో పాటు, దట్టమైన పొగ వ్యాపించింది.

సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీస్ విభాగం, అత్యవసర వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఘటనా స్థలిలో సహాయక దళాలు చర్యలు చేపట్టాయి.

Advertisement

ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాతే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.

Also Read: ఎర్నాకుళం రైలులో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు దగ్ధం, ఒకరు మృతి

పూర్తి విచారణ అనంతరం ప్రమాదానికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అప్పటివరకు హామన్ టన్ ప్రాంతంలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×