E-Paper
Advertisement

Telangana Assembly Winter sessions-2025: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, కేసీఆర్ ఒక్కరోజు మాత్రమే!

Telangana Assembly Winter sessions-2025: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, కేసీఆర్ ఒక్కరోజు మాత్రమే!
Advertisement

Telangana Assembly Winter sessions: తెలంగాణలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు హాట్ హాట్‌గా జరగనున్నాయా? కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై కౌంటర్ ఇచ్చేందుకు పాలకపక్షం సిద్ధమైందా? అధికార-విపక్షాలు తమతమ అస్త్రాలను రెడీ చేశాయా? కానీ, కేసీఆర్ ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి పరిమితం కానున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Advertisement

తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. ఇప్పటికే మీడియా ముందు పలు అంశాలపై పాలక పక్షాన్ని ప్రశ్నించారు మాజీ సీఎం కేసీఆర్. విపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు లేవనెత్తే అంశాలను తిప్పికొట్టేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ వర్గాల నుంచి అందుకున్న సమాచారం మేరకు కేసీఆర్, ఒక్కరోజు మాత్రమే సభకు వస్తున్నట్లు తెలుస్తోంది.

2023 నుంచి ఇప్పటివరకు కేసీఆర్ రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. అంటే ఏడాదికి ఒక్కసారి చొప్పున మాత్రమే. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒకసారి, రెండోసారి బడ్జెట్ సెషన్‌కి మాత్రమే పాల్గొన్నారు. శీతాకాల సమావేశాల్లో కేసీఆర్ ఒక్కరోజు మాత్రమే హాజరవుతారని, చర్చలకు దూరంగా ఉంటారని పార్టీ నేతల మాట. అందుకు కారణాలు లేకపోలేదు.

Advertisement

ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ హాజరు?

ఆరునెలలోపు సమావేశాలకు హాజరుకాకుండా సభ్యత్వం రద్దు అవుతుందని, అందుకే ఈసారి సమావేశాలకు హాజరవుతున్నారని ఆ పార్టీ నేతల మాట. పాలక పక్షాన్ని పోయినవారం మీడియా ముందు ప్రశ్నించారని, ఇప్పుడు ప్రశ్నించడానికి ఏమీ ఉండదని అంటున్నారు. వాటిపై పాలకపక్షం రిప్లై మాత్రమే ఇస్తుందని, అందుకు మిగతా నేతలు ధీటుగా సమాధానం చెబుతున్నారని అంటున్నారు.

గత మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పేరు ఎత్తకుండా కేసీఆర్ మాట్లాడారని అంటున్నారు.  ముఖ్యమంత్రి పేరు తలచడానికి కేసీఆర్ ఇష్టపడడంలేదని కొందరు నేతలు ‘ఆఫ్ ద రికార్డు’లో చెబుతున్నారు. అలాంటప్పుడు ఆయన సభా సమావేశాలకు ఎలా వస్తారని అంటున్నారు.

ALSO READ:  ఈ ఏడాదిలో రూ. 239 కోట్ల ట్రాఫిక్ చలాన్లు.. హైదరాబాద్ పబ్లిక్ మారతారా?

తొలిరోజు సమావేశాల్లో ఎలాంటి చర్చ ఉండదని, ప్రారంభమైన కొద్దిసేపటికి వాయిదా పడుతుందని అంటున్నారు నేతలు. ఆ తర్వాత బీఏసీలో సమావేశాలు ఎన్నిరోజులు? ఏయే అంశాలు ప్రశ్నించాలనే దానిపై చర్చిస్తారని అంటున్నారు.  బీఏసీ సమావేశాలకు హరీష్‌రావు మాత్రమే హాజరవుతారని అంటున్నారు. మొత్తానికి ఎటుచూసినా జగన్ దారిలో కేసీఆర్ వెళ్తున్నట్లు నేతలు ముచ్చటించుకుంటున్నారు.

సోమవారం శాసనసభ సమావేశాలు మొదలుకాగానే తొలుత డిప్యూటీ స్పీకర్‌ని ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత పలు బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లులు సభ ముందుకు రానున్నాయి.

తెలంగాణ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌, తెలంగాణ మునిసిపాలిటీస్‌ చట్ట సవరణ బిల్లు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ చట్ట సవరణకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెడతారు సీఎం రేవంత్‌రెడ్డి. బిల్లులు ప్రవేశ పెట్టిన సభను జనవరి రెండుకు వాయిదా పడనుంది.

Related News

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×