BigTV English

Attack on Pakistan Army : పాకిస్థాన్ కు చుక్కులు చూపిస్తున్న బెలూచ్ ఆర్మీ.. ఏకంగా 40 మంది సైనికులు మృతి, 30 మంది గాయాలు

Attack on Pakistan Army : పాకిస్థాన్ కు చుక్కులు చూపిస్తున్న బెలూచ్ ఆర్మీ.. ఏకంగా 40 మంది సైనికులు మృతి, 30 మంది గాయాలు

Attack on Pakistan Army : పాకిస్థాన్ ప్రభుత్వానికి, సైన్యానికి అక్కడి బెలూచ్ తిరుగుబాటుదారులు చుక్కలు చూపిస్తున్నారు. నిత్యం ఏదో తీరుగా ఆ ప్రాంతంలో అలజడులు సృష్టిస్తూ.. సైన్యాన్ని టార్గెట్ గా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా.. బెలూచూ లిబరేషన్ ఆర్మీ జరిపిన భారీ ఆత్మహుతి దాడుల్లో ఏకంగా 47 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పాక్ సైన్యం గుట్టుగా ఉంచుతున్నా, అంతర్జాతీయ నిఘా సంస్థలు, బెలూచ్ సైన్యం బాహ్య ప్రపంచానికి వెల్లడిస్తున్నాయి. దీంతో.. స్వంత దేశంలోనే బలమైన దేశ విచ్ఛిన పోరాటం క్రమంగా బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.


బెలుచిస్థాన్ ప్రాంతానికి స్వాతంత్య్రం కావాలని, పాక్ ప్రభుత్వ పెత్తనం తమకొద్దని చాన్నాళ్లుగా బెలూచ్ ప్రజలు, అక్కడి తిరుగుబాటుదారులు ఆందోళనలు చేస్తున్నారు. తొలుత సాదారణ నిరసనలగానే ప్రారంభమైన, క్రమంగా.. వారు సైన్యంగా మారి ఆయుధాలతో దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా 47 మంది సైనికుల్ని బెలూచ్ సైన్యం మట్టుబెట్టినట్లు ప్రకటించింది. కానీ.. పాక్ మాత్రం కేవలం ఈ దాడిలో నలుగురు మాత్రమే చనిపోయినట్లు ప్రకటించింది.

బెలూచ్ ఆర్మీ తిరుగుబాటుదారుల దాడుల్లో మరో 30 మంది సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ దాడిని బలూచిస్థాన్‌లోని తుర్బత్‌ వద్ద నిర్వహించగా, ఇందుకు.. బీఎల్‌ఏలోని మాజిద్‌ బ్రిగేడ్‌కు చెందిన ఆత్మాహుతి దళ యూనిట్‌ నేతృత్వం వహించినట్లు వెల్లడించింది. ఈ ప్రాంతం.. బెహ్మాన్ ప్రాంతం తుర్బత్ కు 8 కిలోమీటర్లు దూరంలో ఉన్నట్లు బెలూచ్ ఆర్మీ ప్రకటించింది. కాగా.. అటుగా వెళుతున్న పాక్ సైనిక వాహనాల్ని టార్గెట్గా సాయంత్రం 5.45కు తమ ఆత్మహుతి దళాలు మెరుపుదాడి చేశాయని వెల్లడించింది.


బెలూచ్ ఆర్మీని అణిచివేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న పాక్ సైన్యం కదలికలు ఈ ప్రాంతంలో అధికమయ్యాయి. ఈ క్రమంలోనే బెలూచ్ ప్రాంతం గుండా వెళుతున్న ఐదు బస్సులు, 7 సైనిక వాహనాల కాన్వాయ్‌ను పేల్చేసినట్లు బెలూచ్ తిరుగుబాటుదారుల ప్రతినిధులు ప్రకటించారు. కాగా.. ఈ కాన్వాయ్ కరాచీ నుంచి తుర్బత్‌లోని ఫ్రాంటియర్‌ కోర్‌ హెడ్ ఆఫీస్ కు వెళుతుండగా దాడులు చేసినట్లు వెల్లడించారు.

ఈ కాన్వాయ్ లో సైన్యంలోని వివిధ విభాగాలైన ఎంఐి 309, ఎఫ్‌సీ 117, ఎఫ్‌సీ ఎస్‌ఐయూ, ఎఫ్‌సీ 326 వింగ్, ఎఫ్‌సీ 81 వింగ్, రిటైర్డ్‌ ఆర్మీ కెప్టెన్, పోలీస్‌ అధికారి జోహైబ్‌ మొహసిన్‌ ఉన్నారు. ఈ దాడిలో బస్సు పూర్తిగా తుక్కుతుక్కుగా మారగా.. మిగతా వాహనాలు పేలుళ్ల దాటికి పాక్షికంగా దెబ్బతిన్నట్లు బెలుచూ తిరుగుబాటుదారులు ప్రకటించారు. కాగా.. ఈ దాడికి సంబంధించిన వీడియోలు, చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

తమ ఇంటిలిజెన్స్ విభాగం జిరాబ్ ద్వారా అందిన సమాచారం ఆధారంగా ఈ దాడులు చేసినట్లు తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఇటువంటి దాడులు మరిన్ని చేస్తామన్న బెలూచ్ లిబరేషన్ ఆర్మీ.. తమ ప్రాంతంలోని హైవేలు సైన్యానికి, ప్రభుత్వానికి, ప్రభుత్వ ప్రతినిధులకు ప్రమాదకరమైనవవి ప్రకటించారు. కాబట్టి.. ఇలాంటి కాన్వాయ్ లకు, ప్రభుత్వానికి చెందిన వారికి దూరంగా ఉండాలని, వాటిని ఏలాగైనా పేల్చేస్తామంటూ బెలూచ్ ప్రజలతు తిరుగుబాటుదారులు సూచించారు. 

తమ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఆక్రమించిందని, అక్కడి వనరుల్ని, సహజ సంపదను దోచుకుపోతుందని.. అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. తమను దోచుకుంటూ, అభివృద్ధికి దూరంగా ఉంచుతున్న కారణంగానే.. తమకు స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ ను పాక్ ప్రభుత్వం సైనిక చర్య ద్వారా అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×