Formula E Race Case: ఫార్ములా ఈ కారు రేసు కేసులో విపక్షం బీఆర్ఎస్‌పై అధికార పార్టీ మాటల దాడి తీవ్రతరం చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ ఇతర దేశాలకు పారిపోయే అవకాశం ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. వెంటనే కేటీఆర్ పాస్ పోర్టును ఏసీబీ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
కేటిఆర్ తప్పు చేయకపోతే ఆయనకు లీగల్ టీమ్ ఎందుకు రాలేదో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు వెంకట్. దొంగలకు అండగా నిలుస్తారా? ప్రజలకు అండగా ఉంటారా? మీరు తేల్చుకోవాలన్నా రు. కేటీఆర్‌కు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఏమి తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు హాజరు కాలేదని మండిపడ్డారు.
కేవలం రాజకీయ లబ్ది కోసమే విచారణకు పోలేదన్నారు. బాధ్యత గల శాసనసభ్యునిగా తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలన్నారు. మీ అవినీతిలో 55కోట్లు చిన్నవే కావొచ్చని, కానీ ప్రజల సొమ్ము దోచుకుంటే వదిలే ప్రసక్తే లేదన్నారు. తప్పు చేస్తే ఎవరినైనా ప్రభుత్వం వదిలి పెట్టదని కాసింత ఘాటుగా వ్యాఖ్యానించారు.
రూ. 55 కోట్లు ప్రజల సొమ్ము ప్రభుత్వ ఆస్తి అని, దోచుకున్న ప్రజల సొమ్మును ప్రజలకు పంచిపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్లి ట్రిమ్ అయి వస్తానని చెప్పిన కేటీఆర్, ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో వివిధ సందర్భాల్లో కేటీఆర్ మాట్లాడిన వీడియోలు బయటపెట్టారు. 80 వేల పుస్తకాలు చదివామని చెప్పిన కేటీఆర్, ఆ జ్ఞానమంతా ఇప్పుడు ఏమైందని మండిపడ్డారు.
ALSO READ: ఫార్ములా ఈ కారు రేసు కేసు, ఏసీబీ దూకుడు.. గ్రీన్ కో కంపెనీలో సోదాలు
కేటీఆర్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది: బల్మూరి వెంకట్
అందుకే ఏసీబీ అధికారులు కేటీఆర్ పాస్పోర్టు సీజ్ చేయాలి
దొంగలకు అండగా ఉంటారా.. ప్రజలకు అండగా ఉంటారా?
బాధ్యత గల శాసనసభ్యుడిగా తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి
తప్పు చేస్తే ఎవరినైనా ప్రభుత్వం వదిలిపెట్టదు
– ఎమ్మెల్సీ… pic.twitter.com/slsXvHBss3
— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2025