Garividi lakshmi 1st Song :ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలే లోతైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆడియన్స్ హృదయాలను హత్తుకుంటున్నాయి. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో మెప్పిస్తూ అవార్డులను సైతం కొల్లగొడుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి “గరివిడి లక్ష్మి” సినిమా కూడా చేరబోతోందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. పవర్ఫుల్ పర్ఫామెన్స్ తో తన పాత్రలకు ప్రాణం పోసే హీరోయిన్ ఆనంది(Anandi) లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.
గరివిడి లక్ష్మి నుండి మొదటి లిరికల్ వీడియో సాంగ్..
చిన్న సినిమా అయినా భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా నుండీ “నలజిలకర మొగ్గ” అంటూ సాగే మొదటి లిరికల్ వీడియోని జనవరి 10వ తేదీన లాంచ్ చేయబోతున్నారు మేకర్స్. ఈరోజు అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. గౌరీ నాయుడు జమ్మూ( Gauri Naidu Jammu) దర్శకత్వంలో రాగ్ మయూర్ (Rag Mayur) హీరోగా, ఆనంది హీరోయిన్గా ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రంగా రాబోతోంది ఈ సినిమా. కంచలపాలెం కిషోర్ (Kanchalapalem Kishor) ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.. అంతేకాదు వీకే నరేష్ (VK.Naresh) కూడా ఈ సినిమాలో భాగమైనట్లు తెలుస్తోంది.
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం..
#PMF48 ప్రాజెక్టుగా రాబోతున్న ఈ సినిమా టైటిల్ లాంఛ్ కార్యక్రమం గత ఏడాది డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్లోని ఆదోనిలో చాలా గ్రాండ్గా జరిగింది. ఉత్తరాంధ్రకు చెందిన ఐకానిక్ బుర్రకథా కళాకారిణి గరివిడి లక్ష్మి పూర్తి దాయకమైన కథను ఆధారంగా తీసుకొని, ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎమ్మెల్యే పార్థసారథి ఫస్ట్ క్లాప్ కొట్టగా, ఎమ్మెల్సీ మధు, మల్లప్ప నాయకర్ కెమెరా స్విచ్ ఆన్ చేయడంతో అంగరంగ వైభవంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఉన్న అపారమైన విశ్వాసం ఈవెంట్ గొప్పతనంలో చాలా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇక జనవరి మూడవ వారంలో ఆదోనిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.
గరివిడి లక్ష్మి..
ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. ఇక ఈ చిత్రానికి సహనిర్మాతగా వివేక్ కూచి బొట్ల వ్యవహరిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా ఆదిత్య పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని చరణ్ అర్జున్ అందిస్తున్నారు.