Big Stories

Ex PM Imran Khan Warns: ఆమెకి ఏమైనా అయితే అసలు వదలను.. ఆర్మీ చీఫ్‌కు ఇమ్రాన్ వార్నింగ్!

Imran Khan Warns to Pakistan Army Chief Asim Munir: పాకిస్థాన్ మాజీ పీఎం ఇమ్రాన్‌ఖాన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతేకాదు ఏకంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు రుసరుసలాడారు. ఆమెకు ఏమైనా జరిగితే సహించేది లేదని కుండబద్దలు కొట్టేశారు. ఇంతకీ ఇమ్రాన్‌ఖాన్ ఆవేశం వెనుక కారణమేంటి..? ఒకప్పుడు ఆ ఆర్మీ నేతలే ఇమ్రాన్‌ని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. ఇప్పుడు వాళ్లకే వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ పాకిస్థాన్‌‌లో ఏం జరిగింది.. జరుగుతోంది..? ఆర్మీ చీఫ్‌కు హెచ్చరిక ఇవ్వాల్సిన పరిస్థితి వెనుక కారణమేంటి..?

- Advertisement -

పాకిస్థాన్‌లో రాజకీయాలు ఎప్పుడూ సైన్యం చుట్టూనే తిరుగుతాయి. వారికి అనుకూలంగా ఉన్న నేతలను పైకి తీసుకెళ్తారు. లేకుంటే జైలుకి పంపిస్తారు. ఏళ్ల తరబడి అక్కడ అదే ఆచారం కొనసాగుతోంది. ఈ జాబితాలోని ఎందరో నేతలున్నారు. ఇక మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విషయానికొద్దాం.

- Advertisement -
Pakistan Ex PM Imran Khan Warns Army Chief, happy with my wife
Pakistan Ex PM Imran Khan Warns Army Chief, happy with my wife

ప్రస్తుతం ఓ అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్నారు మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. ఇస్లామాబాద్ శివారులోని ఓ నివాసంలోని గృహ నిర్భంధంలో ఉన్నారు. ఇమ్రాన్ వైఫ్ బుష్రా బీబీ కూడా ఓ కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే బుష్రా కేసు విషయమై ఓ న్యాయమూర్తి కీలక విషయాలను ఆయనతో పంచుకున్నారట. తీర్పు విషయంలో తనపై ఎంతో ఒత్తిడి ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇంకా చాలా విషయాలను ఇమ్రాన్‌‌తో ఆయన షేర్ చేసుకున్నట్లు పాక్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: Two Telugu Girls Arrested in the USA: ఇండియా పరువు తీసేశారు.. అమెరికాలో తెలుగు అమ్మాయిలు అరెస్ట్

తన భార్య బుష్రా బీబీ అరెస్టుకు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ కారణమని విషయం ఇమ్రాన్‌కు ఆలస్యంగా తెలిసింది. దీంతో ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మాజీ పీఎం. తన భార్యకు ఏమైనా జరిగితే సహించేది లేదన్నారు. తాను బతికి ఉన్నంత వరకు ఆసిమ్‌ను వదిలిపెట్టనని కాస్త గట్టిగా స్వరం పెంచారు. దేశంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని దుయ్యబట్టారు. ఆ రాజ్యంలో అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకుంటాడన్నారు. తక్కువ వ్యవధిలో శిక్షలు కూడా వేయిస్తాడని విమర్శించాడు.

జనరల్ మునీర్ తీసుకున్న నిర్ణయాలను త్వరలోనే బహిర్గతం చేస్తానన్నారు మాజీ పీఎం. ఆటవిక రాజ్యం కొనసాగినంత కాలం దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుందని ఆరోపించారు. పెట్టుబడుల ద్వారానే ఆర్థిక స్థిరత్వం వస్తుందని, అప్పుడు చట్టాలు సక్రమంగా అమలు కావాలన్నారు. ఇప్పటివరకు పాకిస్థాన్‌ను పాలించిన పాలకులు ఈ రేంజ్‌లో ఓపెన్‌గా మాట్లాడిన సందర్భాలు లేవు. మరి జనరల్ ఆసిమ్.. ఇమ్రాన్ వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతారా..? లేక సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతారో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News