Big Stories

Dharmavaram Politics: కేతిరెడ్డిపై యాదవ యుద్ధం.. రంగంలోకి పరిటాల సైన్యం

Political Review on Dharmavaram Constituency Anantapur District: అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ ఉన్న నియోజకవర్గాల్లో ధర్మవరం ఒకటి అలాంటి చోట ఈ సారి ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది. పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి దక్కింది. ధర్మవరానికి పూర్తిగా కొత్త వ్యక్తి అయిన నాన్ లోకల్ లీడర్ సత్యప్రసాద్‌కు టికెట్ కేటాయించింది బీజేపీ. సత్యకుమార్ గెలుపు బాధ్యతలను పరిటాల శ్రీరామ్ భుజానికెత్తుకున్నారు. మిత్రపక్షాల మద్దతుతో ఆయన కూడా వైసీపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. స్మూత్‌గా కనిపించే సత్యకుమార్.. ఎమ్మెల్యే కేతిరెడ్డికి సవాళ్లు విసురుతూ మిత్రపక్షాల శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హైవోల్టేజ్ పోరు సాగే నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం. టీడీపీ బలమైన కేడర్ ఉన్న ఆ సెగ్మెంట్లో ఆ పార్టీ ఆవిర్భావం నుంచి 2004 వరకు టీడీపీ అభ్యర్ధులే విజయాలు సొంతం చేసుకున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా రెండో సారి గెలిచారు. ఫ్యాక్షన్ నేపధ్యం ఉన్న ఆ నియోజకవర్గంలో పోరాటం కూడా ఆ బ్యాక్ గ్రౌండ్ ఉన్న లీడర్ల మధ్యే ఉండేది.

- Advertisement -

వైసీపీ నుంచి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పోటీకి సిద్దమయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేయాలని భావించిన ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్‌కు పొత్తుల లెక్కలు కలిసిరాలేదు. మరోవైపు బీజేపీలో ఉన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తిరిగి టీడీపీలో చేరి టికెట్ దక్కించుకోవడానికి చాలా రోజులు హడావుడి చేశారు. ఆ క్రమంలో పరిటాల, సూరి వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి కూడా అయితే ఆ సీటు బీజేపీకి దక్కినా వరదాపురం సూరికి ఛాన్స్ ఇవ్వలేదు బీజేపీ పెద్దలు  తాను పోటీలో లేకపోయినా ఫర్వాలేదు కాని. సూరికి మాత్రం టికెట్ దక్కకూడదని పరిటాల ఫ్యామిలీ పావులు కదపడటం వల్లే సూరికి అవకాశం లేకుండా పోయిందన్న ప్రచారం ఉంది.

- Advertisement -

చివరికి పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లు ధర్మవరం అభ్యర్ధిగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ యాదవ్‌ను డిక్లేర్ చేశారు. సత్యకుమార్‌ది ధర్మవరం కాదు.. అసలు అనంతపురం జిల్లానే కాదు. అయినా పొత్తుల మ్యాజిక్‌లో భాగంగా అభ్యర్థి అయిపోయారు. అదీకాక చూడటానికి సాఫ్ట్‌గా కనిపిస్తారు. అటు చూస్తే ధర్మవరంలో వైసీపీ అభ్యర్ధి కేతిరెడ్డి.. గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాంతో రాష్ట్రవ్యాప్తంగా ఫేమస్ అయిన వ్యక్తి . ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

మరి అలాంటాయన్ని ఢీ కొట్టాలంటే తాను కూడా స్పీడ్ పెంచాలనుకున్నారో? ఏమో? ధర్మవరం వచ్చీ రాగానే దూకుడు ప్రదర్శిస్తున్నరు సత్యకుమార్ ధర్మవరం శాసనసభ స్థానం బీసీలకు అడ్డా అని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గంలో 2,40,323 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో చేనేత కార్మికులు, మగ్గాలు నేసే వృత్తిలో ఉన్న వారే ఎక్కువ. వారి చేతిలో రూపుదిద్దుకునే చీరలు, వస్త్రాలకు జాతీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. ధర్మవరంలో చేనేత వర్గం ఓట్లే 40 శాతం ఉంటాయంటే ఎన్నికల్లో వారు ఎంత ప్రభావితంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు.. ఇక బీసీల్లోని ఇతర కులాలు, ఎస్‌టి, ఎస్‌సి, ముస్లీం ఓటర్లు 25 నుంచి 35 శాతం వరకు ఉంటారని లెక్కలు చెప్తున్నాయి. కమ్మ, రెడ్డి వర్గాలు కలిపి 25 నుంచి 30 శాతం ఓట్లు ఉంటాయంటున్నారు.

Also Read: f3 కుటుంబ కథా చిత్రమ్..

ధర్మవరం నియోజకవర్గానికి 1951 నుంచి జరిగిన 15 ఎన్నికల్లో.. టీడీపీ ఏడు సార్లు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ నాలుగుసార్లు, వైసీపీ అభ్యర్థి గత ఎన్నికల్లో ఒకసారి విజయం సాధించారు. ఆయా ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రారంభం నుంచి టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన రెడ్డి, కమ్మ సామాజిక వర్గం నేతలే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే మొదటి సారిగా ఒక బీసీ వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇచ్చింది బీజేపీ.

బిజెపి, టిడిపి, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్‌యాదవ్‌ ధర్మవరంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు భారీ స్వాగతం లభించింది. ఆ సందర్భంగా ఆయన మొదటి ప్రసంగంలోనే వైసీపీకి ఘాటైన హెచ్చరికలు చేశారు. ధర్మవరంలో ఇప్పటివరకు జరిగింది ఒక లెక్క ఇక జరగబోయేది మరో లెక్క అంటూ స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇన్నేళ్లు సాగిన రాక్షస పాలనకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ధర్మవరం పొలిమేర వరకు తరిమి కొట్టడానికి అవకాశమివ్వాలని ప్రజలను కోరారు.

ఎమ్మెల్యే కేతిరెడ్డిని పాపులర్ చేసిన గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాంపై కూడా సత్యకుమార్ ధ్వజమెత్తారు. గుడ్ మార్నింగ్ పేరుతో ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో అందరికీ తెలుసని జగన్ తాత రాజారెడ్డి స్ఫూర్తితో ఆ ప్రోగ్రాం నిర్వహిస్తున్నానంటున్న కేతిరెడ్డి రౌడీయిజానికి చెక్ పెట్టడం ఎలాగో తనకు తెలుసని వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు సత్యకుమార్‌ గెలిపించే బాధ్యతలు భుజానికెత్తుకున్న పరిటాల శ్రీరామ్ అక్కడ పోటీ చేస్తుంది సత్యకుమార్ కాదు. ఆయనలో తనను చూడండని టీడీపీ శ్రేణులకు పిలుపునివ్వడం మిత్రపక్షాల కేడర్‌లో ఉత్సాహం నింపుతోంది.. ఆ ఒక్క మాటతో పరిటాల అభిమానులకు మరింత దగ్గరయ్యారు సత్య కుమార్. ఇక టీడీపీ ఎంపీ అభ్యర్ధి పార్థసారథి సైతం సత్యప్రసారద్‌ని ఓన్ చేసుకుంటూ తమ ఇద్దరి గెలుపు ఖాయమంటున్నారు.

మొత్తమ్మీద టీడీపీ, జనసేనల నుంచి లభిస్తున్న మద్దతుతో సత్య కుమార్ ధర్మవరంలో స్పీడ్ పెంచుతున్నారు. ఓ వైపు బీసీ కార్డు మరోవైపు పరిటాల అభిమానులు, జనసైనికుల సపోర్ట్‌తో కేతిరెడ్డికి చెక్ పెడతానంటున్నారు. ధర్మవరం లెక్కలు మారుస్తానంటున్నారు. మరి చూడాలి ధర్మవరం ఓటర్లు తీర్పు ఎలా ఉంటుందో?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News