Yuvraj Singh: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని జోరుగా చర్చ జరిగింది. లార్డ్స్ లో అతని రిటైర్మెంట్ ఖరారు అయినట్లు కూడా ప్రచారం చేశారు. అయితే వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ… లార్డ్స్ వేదికగా సెంచరీ చేసి ఇరగదీసాడు రోహిత్ శర్మ. అటు చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ కూడా అదరగొట్టాడు. ఈ క్రమంలో లార్డ్స్ వన్డే కు హాజరైన యువరాజ్ సింగ్ (Yuvraj Singh ) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా జట్టుకు విరాట్ కోహ్లీ (Virat Kohli) అలాగే రోహిత్ శర్మ (Rohit Sharma ) ఇద్దరూ హార్ట్ బీట్ (heartbeat of Indian cricket) లాంటి వాళ్ళు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్ వరకు కాదు.. వాళ్ళ వయసు 70 ఏళ్ళు వచ్చేవరకైనా ఆడాల్సిందే అంటూ తేల్చి చెప్పారు. వాళ్లకు నచ్చినప్పుడే రిటైర్మెంట్ ఇస్తారని.. అనవసరంగా రో-కో కాంబినేషన్ పై ఒత్తిడి తీసుకురాకూడదని కోరారు యువరాజ్ సింగ్. దీంతో యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియన్ పోలీసులు !
2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై యువరాజ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కు వాళ్ల ఇద్దరి అనుభవం ఎంత ముఖ్యమో తెలియజేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాలో జరుగుతుందని… ఈ నేపథ్యంలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఇద్దరు టీమిండియాలో ఉండాల్సిందేనని తెలిపారు. అప్పుడే వన్డే వరల్డ్ కప్ గెలుస్తామని వివరించారు. ఇప్పటివరకు టీమిండియా కు ఇద్దరు చేసిన సేవలను గుర్తించి అభిమానులు వాళ్లను మెచ్చుకోవాలన్నారు.
బాగా ఆడినప్పుడు మెచ్చుకోవడం… ఒకటి రెండు మ్యాచ్ల్లో విఫలమైతే తిట్టడం క్రికెట్ కాదన్నారు. ఆ ఇద్దరికీ మంచి అవకాశాలు ఇవ్వాలని కోరారు. కచ్చితంగా 2027 వన్డే వరల్డ్ కప్ జట్టులో రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లీ ఉండాలని పేర్కొన్నారు. అప్పుడే టీమిండియా అద్భుతంగా ముందుకు రానించి… దక్షిణాఫ్రికాలో వరల్డ్ కప్ కొడుతుందని స్పష్టం చేశారు. ఆవేశపడి ఈ ఇద్దరినీ దూరం చేసుకోకూడదని కోరారు. రిటైర్మెంట్ విషయంలో ఎలాంటి ఒత్తిడి చేయకూడదని కూడా రిక్వెస్ట్ చేశారు యువరాజ్ సింగ్. 2027 వన్డే వరల్డ్ కప్ అయిన తర్వాత వాళ్లే రిటైర్మెంట్ ఇస్తారని.. అప్పటివరకు బలవంత పెట్టకూడదని స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు లార్డ్స్ వన్డేలో అద్భుతంగా రాణించారు. ఇప్పటికే ఈ మూడవ వన్డేలో రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగి సెంచరీ చేయగా…. విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ తో రెచ్చిపోయాడు. ప్రస్తుతం కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు.