E-Paper
Advertisement

Teja Sajja’s Mirai Glimpse: తేజ సజ్జ కొత్త సినిమా ‘మిరాయ్’.. ఎంటా ఫైట్స్..? మనోడికి మరో హిట్ పక్కా!

Teja Sajja’s Mirai Glimpse: తేజ సజ్జ కొత్త సినిమా ‘మిరాయ్’.. ఎంటా ఫైట్స్..? మనోడికి మరో హిట్ పక్కా!
Advertisement

Actor Teja Sajja’s ‘Mirai’ Movie First Glimpse Released: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ఈ ఏడాది ‘హనుమాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయి ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాలో తేజ సజ్జ తన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు.

అంతేకాకుండా ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉండటంతో సినిమా మరో రేంజ్‌లో ప్రేక్షకుల్ని అలరించింది. ఇక ఈ మూవీ తర్వాత తేజ సజ్జకు అదిరిపోయే సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఇందులో భాగంగానే అతడు ఇప్పుడు ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Advertisement

తేజ తన కొత్త సినిమాను రవితేజ ‘ఈగల్’ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేనితో చేస్తున్నాడు. ఆ మూవీకి సంబంధించి ఈ రోజు టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి గానూ ‘మిరాయ్’ అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. అంతేకాకుండా టైటిల్ రివీల్‌తో రిలీజ్ చేసిన గ్లింప్స్ మహా అద్భుతంగా ఉంది.

Advertisement

Also Read: నాని రీల్ కూతురుతో తేజ రొమాన్స్..?

ఈ గ్లింప్స్ టీజర్ ప్రకారం.. ముందుగా ఒక గ్రంథాన్ని చూపించారు. ఆ తర్వాత మంచు కొండలను చూపిస్తూ సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు. అలాగే యుద్ద సన్నివేశాలతో కట్ చేసిన గ్లింప్స్ సూపర్‌గా ఉంది. ఆ తర్వాత వచ్చే విజువల్స్ అత్యద్భుతంగా ఉన్నాయి. దీనిబట్టి చూస్తే సినిమా చాలా విజువల్ వండర్‌గా ఫుల్ యాక్షన్ సీన్లతో ఉన్నట్లు తెలుస్తోంది.

సినిమా మొత్తం ఒక గ్రంథం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ గ్లింప్స్‌లో తేజ సజ్జ లుక్ వేరే రేంజ్‌లో ఉంది. అతడు చేసే యాక్షన్ సీన్లు ఆడియన్స్‌లో ఫుల్ జోష్ నింపాయి. అలాగే ఒక లేడీతో తేజ చేసే యాక్షన్ సీన్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

మొత్తంగా ఆసక్తి రేకెత్తించే సీన్లతో కట్ చేసిన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నట్లు రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్‌లో మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×