E-Paper
Advertisement

Pakistan Strike: కాబూల్‌లో ఓ ఆసుపత్రిపై పాకిస్థాన్ దాడులు.. 400 మందిని లేపేసింది, మూల్యం తప్పదని

Pakistan Strike: కాబూల్‌లో ఓ ఆసుపత్రిపై పాకిస్థాన్ దాడులు.. 400 మందిని లేపేసింది, మూల్యం తప్పదని
Advertisement

Pakistan Strike: ఆఫ్ఘనిస్థాన్‌పై దూకుడు పెంచింది పాకిస్థాన్. ఎలాగైనా కాబూల్ గడ్డపై తీవ్రవాదులను లేపేయాలని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో వైమానిక దాడులు తీవ్రతరం చేసింది. కాబూల్‌లోని ఓ ఆసుపత్రి‌పై చేసిన వైమానిక దాడుల్లో 400 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని తాలిబ‌న్ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. అసలేం జరుగుతోంది?

ఆప్ఘాన్‌పై దూకుడు పెంచిన పాకిస్థాన్.. ఆపై వైమానిక దాడులు

Advertisement

పొరుగు దేశం పాకిస్థాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఉగ్రవాదుల కోసం దాదాపు నెల రోజులుగా ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై వైమానిక దాడులు చేస్తోంది పాకిస్తాన్. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఓ ఆసుపత్రి‌పై వైమానిక దాడులు చేసింది. ఈ సంఘటనలో ఏకంగా 400 మంది పౌరులు మృతి చెందారు.మరో 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని తాలిబ‌న్ ప్రభుత్వం వెల్లడించింది.

డ్రగ్స్‌కు బానిసైన వారికి కాబూల్‌లో ట్రీట్‌మెంట్ అందించే ఆసుపత్రి‌పై వైమానిక దాడి జరిగినట్లు స్థానిక ఆఫ్ఘనిస్తాన్ మీడియా తెలిపింది. పాకిస్తాన్.. మరోసారి ఆఫ్ఘనిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘించిందని తాలిబన్ ప్రభుత్వం పేర్కొంది. కాబూల్‌లోని మాదకద్రవ్యాల పునరావాస ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని తెలిపింది.

Advertisement

కాబూల్ ఆసుపత్రిపై పాక్ వైమానిక దాడి.. 400 మంది మృతి

ఫలితంగా చికిత్స పొందుతున్నవారు వందల సంఖ్యలో మరణించారని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అన్నారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న పోరాటం మూడో వారానికి చేరుకుంది. ఇరు దేశాలు ఉమ్మడి సరిహద్దులో కాల్పులు హారా హోరీగా జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారని ఆఫ్ఘన్ అధికారులు చెప్పిన కొన్నిగంటల తర్వాత ఈ దాడి జరిగింది.

ఈ ఘటన వల్ల భారీగా ప్రాణనష్టం జరిగిందని తెలిపింది. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, అలాంటి చర్య ఆమోదించబడిన సూత్రాలకు విరుద్ధమైనది ఆదేశం తెలిపింది. మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరంగా పరిగణిస్తున్నామని తాలిబన్ ప్రభుత్వం పేర్కొంది.

ALSO READ: అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం

పాకిస్తాన్ వైమానిక దాడిలో ఆసుపత్రి భారీగా ధ్వంసమైందని పేర్కొంది. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తాలిబాన్ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఆఫ్ఘాన్ ప్రభుత్వ ఆరోపణలను పాకిస్తాన్ కొట్టి పారేసింది. వైమానిక దాడుల్లో తాము ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకోలేదని చెబుతోంది. కావాలనే ఆ విధంగా ప్రచారం చేస్తోందని పాక్ అంటోంది.

 

 

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Big Stories

Advertisement
×