BigTV English

Pakistan : భారత్‌పై విషం చిమ్మిన పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో..

Pakistan : భారత్‌పై విషం చిమ్మిన పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో..

Pakistan : భారత్‌పై విషం చిమ్మకపోతే పాకిస్తాన్‌కు పూట గడవదు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు, తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎప్పుడూ భారత్ ఉసురు పోసుకుంటూనే ఉంటారు అక్కడి నేతలు. రాజకీయ ఎదుగుదల కోసం అక్కడి ప్రజల్లో విష బీజాలు నాటుతూనే ఉంటారు. పాకిస్థాన్, భారత్ మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో. ప్రధాని మోడీని కించపరిచేలా ఐక్యరాజ్యసమితి వేదికపై మాట్లాడారు.


ఉగ్రవాదానికి వ్యతిరేఖంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో వాడివేడి చర్చ జరిగింది. సమావేశంలో గురివింద సమేతలా చిలుక పలుకులు పలికారు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో. బిన్ లాడెన్ చనిపోయాడు, కానీ ఇంకా గుజరాతీ కసాయి బ్రతుకుతుంది, అతనే ఇప్పుడు భారతదేశానికి ప్రధాన మంత్రి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఓ వైపు ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్.. ఇలా నీతి వ్యాఖ్యలు వల్లించడంపై భారత్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. అటూ మోడీపై పాక్ మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా తోసిపుచ్చారు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్. ఉగ్రవాద సంస్థలకు పాకిస్తానే కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందని అతని వ్యాఖ్యలను తిప్పికొట్టారు.


పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో జర్దారీ వ్యాఖ్యలపై భారత్‌లోని బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. మోడీకి బుట్టో జర్ధారీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. బిలావల్ బుట్టి దిష్టి బొమ్మను దగ్దం చేస్తున్నారు. ఉగ్రవాదానికి కేరాఫ్ అయిన పాకిస్తాన్.. మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని బీజేపీ నేతలతో పాటు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పాక్ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని..లేకపోతే మరో సర్జికల్ స్ట్రైక్ చూస్తారంటూ వార్నింగ్ ఇస్తున్నారు.

పాక్ మంత్రి నోటిదురుసు వ్యాఖ్యలపై.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి మండిపడ్డారు. బహీర్‌భాగ్‌ నుంచి ట్యాంక్ బండ్‌‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు ఐతే.. పాకిస్తాన్ విషగురువని బండి సంజయ్ మండిపడ్డారు. పాకిస్థాన్ అంటేనే ఉగ్రవాదుల దేశం.. టెర్రరిస్టులకు స్థావరాలు పాకిస్తాన్‌లో ఉన్నాయని ఆయన కామెంట్ చేసారు.

అటు ఏపీలోనూ నిరసనలు భగ్గుమన్నాయి. ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో..పాక్ మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. పాకిస్తాన్ వ్యతిరేకంగా నిదానాలు చేసారు. ప్రధాని మోడీకి.. బిలావల్ భుట్టో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

మోదీని కించపరిచేలా మాట్లాడిన పాక్ మంత్రిపై యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఆందోళనలు మిన్నంటాయి. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు

పాకిస్థాన్‌కు ఎంపీ నవనీత్ కౌర్ వార్నింగ్ ఇచ్చారు. పాక్ మంత్రులు తమ హద్దుల్లో ఉండాలన్నారు. భారత ప్రధానిని అంటే.. దేశ ప్రజలందరినీ అన్నట్టేనని నవనీత్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Tags

Related News

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Big Stories

×