E-Paper
Advertisement

PM Modi UAE: యూఏఈపై దాడులను ఖండించిన ప్రధాని మోదీ.. అండగా ఉంటామని వెల్లడి

PM Modi UAE: యూఏఈపై దాడులను ఖండించిన ప్రధాని మోదీ.. అండగా ఉంటామని వెల్లడి
Advertisement

PM Modi UAE: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో యూఏఈపై జరుగుతున్న దాడులను ఖండించారు ప్రధాని నరేంద్రమోదీ. ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి అన్నివిధాలుగా మద్దతు ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఆ సమయంలో భారతీయులను ఆదుకున్నందుకు ఆ దేశానికి కృతజ్ఞతలు తెలిపారు.

యూఏఈపై దాడులను ఖండించిన ప్రధాని మోదీ

Advertisement

ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం మధ్యాహ్నం యూఏఈకి చేరుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. ప్రధాని నరేంద్రమోదీ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆ దేశ సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమయ్యారు. వివిధ కీలక అంశాలపై ప్రధానంగా చర్చించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ, యూఏఈపై దాడులు జరగడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ దాడులకు భారత్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకు యూఏఈ తీసుకుంటున్న చర్యలను తాము స్వాగతిస్తున్నామన్నారు.

Advertisement

యూఏఈకి భారత్ అండగా ఉంటుంది- ప్రధాని మోదీ

యుద్ధం సమయంలో యూఏఈలో ఉంటున్న భారతీయులను ఆదుకున్నందుకు ఆ దేశ ప్రభుత్వానికి, రాజ కుటుంబానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రధాని. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడుతోందన్నారు. ముఖ్యంగా సమస్యల పరిష్కారానికి తాము దౌత్య చర్చలకే ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

హార్ముజ్ జలసంధి స్వేచ్ఛగా తెరిచి ఉండాలన్నారు. అదే సమయంలో అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండటం చాలా అవసరమన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా యూఏఈకి భారత్ అండగా ఉంటుందన్నారు. ఈ ప్రాంతంలో శాంతి స్థాపన కోసం సాధ్యమైనంత మేర సహకారం అందిస్తామన్నారు.

ALSO READ: అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. చిలుకూరు బాలాజీ టెంపుల్‌పై అక్కసు, ఏం జరిగింది?

యూఏఈ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడుతున్నానని, స్వయంగా కలవాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూశానన్నారు ప్రధాని మోదీ. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. జనవరిలో తీసుకున్న నిర్ణయాలతో తక్కువ సమయంలో ఇరు దేశాల సంబంధాలు ఎంతో మెరుగుపడ్డాయని ఈ సందర్భంగా వివరించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇరుదేశాల వ్యూహాత్మక సహకారం ప్రాముఖ్యత విపరీతంగా పెరిగిందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కలిసి ముందుకు సాగుతామన్నారు ప్రధాని. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించగానే రక్షణగా ఆ దేశానికి చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్లు ఎస్కార్ట్‌గా వచ్చాయి.

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Big Stories

Advertisement
×