E-Paper
Advertisement

ధాన్యపు కుప్పలపై రైతుల పడిగాపులు.. అధికారుల నిర్లక్ష్యంపై జీవన్ రెడ్డి ఆగ్రహం!

ధాన్యపు కుప్పలపై రైతుల పడిగాపులు.. అధికారుల నిర్లక్ష్యంపై జీవన్ రెడ్డి ఆగ్రహం!
Advertisement

Jeevan Reddy: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు కల్లాల్లోనే పడిగాపులు కాస్తున్నారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది 2.5 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే, ఈ ఏడాది కేవలం 1.20 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని మండిపడ్డారు. ధాన్యం రవాణాకు లారీలు మాయమై ట్రాక్టర్లు మాత్రమే కనిపిస్తున్నాయని, అసలు లారీలు ఎందుకు తగ్గాయో అధికారులకు అవగాహన లేదా అని ప్రశ్నించారు.  తూకం వేసేందుకు గన్ని బ్యాగులు లేకపోవడం, క్వింటాల్‌కు అదనపు తూకం వేస్తూ రైతులను నష్ట పరచడంపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి , ఇప్పటివరకు ఎంత మందిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

మార్కెట్ యార్డులో ప్రైవేట్ కాంట్రాక్టర్ల అరాచకం

Advertisement

జగిత్యాల మార్కెట్ యార్డ్‌లో మక్కల నిల్వకు స్థలం కొరత ఉన్నప్పటికీ, మున్సిపాలిటీ నిర్మించిన మాడు మార్కెట్లలో ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ సిమెంట్, స్టీల్ నిల్వ చేసుకున్నాడని జీవన్ రెడ్డి ఆరోపించారు. బిల్లులు రాలేదనే నెపంతో కాంట్రాక్టర్ సామాగ్రి వేస్తే అధికారులు ఎందుకు స్పందించడం లేదని, బిల్లులు రాకపోతే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తారా అని నిలదీశారు. కలెక్టర్‌కు పరిస్థితులపై అవగాహన లేకపోతే ఇతరులు సలహాలు స్వీకరించాలన్నారు. వెంటనే ఆ కాంట్రాక్టర్‌ను ఖాళీ చేయించి, మక్కల నిల్వకు, అవసరమైతే నెట్టింగ్‌కు ఆ స్థలాన్ని కేటాయించాలన్నారు.

కేంద్రీయ విద్యాలయం, విద్యాసంస్థల స్థలాల కేటాయింపు

Advertisement

కేంద్రీయ విద్యాలయాన్ని కేంద్రం మంజూరు చేసినా, స్థలం కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు 25 ఎకరాలు, స్పోర్ట్స్ కోసం 10 ఎకరాలు తక్షణమే కేటాయించాలన్నారు. స్థలం కేటాయింపు కోసం మంత్రులకు లేఖలు రాయడం కాదని, ఎమ్మెల్యే 24 గంటలూ సీఎం క్యాంప్ ఆఫీసులోనే ఉంటారు కాబట్టి, నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడితే అర నిమిషంలో జీవో వస్తుందన్నారు. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ కాలేజీ స్థలాన్ని జ్యుడిషియల్‌కు కేటాయించినట్టే, సీఎం తన విచక్షణా అధికారంతో జగిత్యాలకు స్థలాన్ని మంజూరు చేయాలన్నారు. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నాటికి ఈ విద్యాసంస్థలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

ఎంపీ, ఎమ్మెల్యేలపై విమర్శలు

జగన్నాథపూర్ బోర్నపల్లి వంతెన కోసం మంత్రి లక్ష్మణ్ కుమార్ మొదటి సంతకంతో రూ.18 కోట్లు కేటాయించారని, అయితే ఎమ్మెల్యే దీనికోసం కేంద్ర మంత్రికి లేఖ రాశానని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కేంద్రానికి రాస్తే ఇక్కడ టెండర్లు అవుతాయా, అసలు ఎమ్మెల్యేకు అవగాహన ఉందా అని ప్రశ్నించారు. నూకపల్లి డబుల్ బెడ్‌రూమ్‌లు, జాబితాపూర్ గోడౌన్లు వంటి ఏ పనులు జరగాలన్నా ‘గౌరీ శంకర్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్’ ద్వారానే టెండర్లు వేయించాలని హితవు పలికారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు కేవలం రూ.10 పెంచడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఎంపీ అర్వింద్ ధాన్యం సేకరణపై దృష్టి పెట్టి, కలెక్టర్‌తో సమీక్ష జరపాలని, స్థలాల కేటాయింపు కోసం నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలవాలని సూచించారు.

Also Read: ఫోటోలతో బ్లాక్‌మెయిల్.. 16 ఏళ్ల కూతురిపై సొంత బాబాయ్ ఘాతుకం!

Related News

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ, ట్రోల్ చేయకుండా

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

Big Stories

Advertisement
×