BigTV English

Rahat Fateh Ali Khan | శిష్యుడిని కెమెరా ముందు చెప్పుతో కొట్టిన ఫేమస్ సింగర్.. ఇది మామూలే అంటూ బుకాయింపు

Rahat Fateh Ali Khan | ప్రపంచమంతా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఓ సంగీత విద్వాంసుడు, గాయకుడు తన వద్ద సంగీతం నేర్చుకునే శిష్యుడిని చెప్పుతో కొట్టాడు. అది కూడా ఒకసారి కాదు చాలా సార్లు. ఇదంతా ఒక వ్యక్తి వీడియో తీయగా..ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.

Rahat Fateh Ali Khan | శిష్యుడిని కెమెరా ముందు చెప్పుతో కొట్టిన ఫేమస్ సింగర్.. ఇది మామూలే అంటూ బుకాయింపు

Rahat Fateh Ali Khan | ప్రపంచమంతా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఓ సంగీత విద్వాంసుడు, గాయకుడు తన వద్ద సంగీతం నేర్చుకునే శిష్యుడిని చెప్పుతో కొట్టాడు. అది కూడా ఒకసారి కాదు చాలా సార్లు. ఇదంతా ఒక వ్యక్తి వీడియో తీయగా..ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.


ఇతంకీ ఎవరా సింగర్ అనుకుంటున్నారా.. అతనే పాకిస్తానీ ఫేమస్ సింగర్ రాహత్ ఫతే అలీ ఖాన్. ఆయన పాటంటే చెవికోసుకునే వారు పాకిస్తాన్, ఇండియాలోనే కాదు ప్రపంచమంతా ఉన్నారు. ఆయన గాయకుడు, సంగీతకారుడు కూడా. ఆయన పాడే పాటలు ఎంతో మధురంగా ఉంటాయని చాలామంది చెబుతుంటారు.

అలాంటి రాహత్ ఫతే అలీ ఖాన్ తన శిష్యుడిని చెప్పుతీసుకొని ఉతికేశాడు. ఏవో బూతులు కూడా తిడుతున్నాడు. ఇదంతా అక్కడ పక్కనే ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇక చెప్పేదేముంది రాహత్ ఫతే అలీ ఖాన్ వీడియో అంటే నెటిజెన్స్.. తెగ చేసేశారు.


ఈ వీడియో చూసి నెటిజెన్స్ అందరూ ఫైరయ్యారు. అంతటి పేరున్న సింగర్‌కు మానవత్వం లేదా? అంటూ పోస్టులు పెట్టారు.

దీంతో ఖంగుతిన్న రాహత్.. వెంటనే మరో వీడియో పోస్ట్ చేశాడు. దాంట్లో ఆ దెబ్బలుతిన్న శిష్యుడు ఉన్నాడు. అతను ఇంతకుముందు వీడియోపై వివరణ ఇచ్చాడు. తన గురువుకు తనను కొట్టే హక్కు ఉందని.. ఆయన తనకు తండ్రి లాంటి వాడని చెప్పాడు. అలా కొట్టడానికి కారణం కూడా చెప్పాడు. తన గురువు తనకు ఓ మంత్రిచిన నీళ్ల బాటిల్ ఇచ్చారని.. అది చాలా ముఖ్యమైనదని.. తన తప్పు వల్ల ఆ బాటిల్ ఎక్కడో పోయిందని అన్నాడు. అలాంటి తప్పుడు తన వల్ల తరుచూ జరగడంతో తన గురువు తనను శిక్షించారని వివరించాడు.

అయితే నెటిజెన్స్ అతని సమాధానం ఒక బుకాయింపు అని కొట్టిపారేస్తున్నారు. విషయం బయటికి తెలియడంతో రాహత్ ఫతే అలీ ఖాన్ తన శిష్యుడికి భయపెట్టి ఈ వీడియో పెట్టించాడని నెటిజెన్స్ పోస్టులు పెడుతున్నారు.

Rahat Fateh ali khan, beat, disciple, footwear, viral video, Pakistan,

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×