BigTV English

Russia New Ministry : ఎక్కువ మంది పిల్లల్ని కనిపించేందుకో మంత్రిత్వ శాఖ.. ఆ దేశంలో అంతే మరి

Russia New Ministry : ఎక్కువ మంది పిల్లల్ని కనిపించేందుకో మంత్రిత్వ శాఖ.. ఆ దేశంలో అంతే మరి

Russia New Ministry : రెండేళ్లుగా ఉక్రెయిన్ తో యుద్ధంలో పోరాడుతున్న రష్యాకు ఇప్పుడు సరికొత్త సమస్య ఇబ్బంది పెడుతోంది. ప్రపంచంలోనే అమెరికాతో పోటీపడే శక్తిసామర్ధ్యాలున్న ఈ దేశంలో ఇప్పుడు జనాభా నిష్పత్తిలో వ్యత్యాసాలు భయాన్ని కలిగిస్తున్నాయి. అందుకే.. సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనే ఆలోచనల్లో పడ్డ రష్యా ప్రభుత్వానికి.. ఓ సరికొత్త ఆలోచన వచ్చింది. దేశంలో మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ పేరుతో సరికొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి.. దాని ద్వారా దేశవ్యాప్తంగా జననాల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు చేయాలనేది దాని సారాంశం.


ప్రపంచంలోనే అతిపెద్ద భూభాగం కలిగి ఉన్న రష్యాలో 2022 నాటి లెక్కల ప్రకారం… 14.38 కోట్ల మందే ఉన్నారు. దాని విస్తీర్ణానికి, అందులోని జనాభాకు అసలు సంబంధం లేని విషయం. పైగా.. ఇక్కడ జననాల రేటు సైతం గత కొన్నేళ్లుగా పడిపోతుంది. అంటే.. ఓ మరణాల నమోదవుతుంటే, దానికి తగ్గట్టుగానే జననాలు నమోదు కావాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో తేడాలు వచ్చినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా.. రష్యాలో… చోటుచేసుకుంటున్న మరణాలతో పోల్చితే, జననాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు అక్కడి అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే.. ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ ఇటీవల కాలంలో రష్యా అధికారులు ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారు. వివిధ పథకాల ద్వారా వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటిస్తోంది. అయినా.. పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో.. ఇప్పుడు సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. జననాల రేటులోని వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఏకంగా… మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చింది. ఈ మేరకు.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఓ ఏజెన్సీ.. జనాభాను పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై దీనికి పూర్తి అధికారాలు కట్టబెట్టాలని సూచించింది. ఈ ఆలోచనపై.. కుటుంబ రక్షణకు సంబంధించిన విషయాలపై చర్చించే పార్లమెంట్ కమిటీ దానిని పరిశీలిస్తోంది.


యువత రిలేషన్ షిప్ మొదలుపెట్టి.. ఫస్ట్ డేట్ కు వెళితే.. 5000 రూబెల్స్ ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇప్పటి వరకు వివిధ పనుల్లో ఉండి, ఇప్పుడు ఉద్యోగం మానేయాలనుకునే వారికి ప్రభుత్వమే సాయం చేయాలని, అలాంటి వాళ్లు పిల్లల్ని కనేందుకు ప్రోత్సహించాలని సూచించింది. మరోవైపు.. రష్యాలోని మహిళల వ్యక్తిగత వివరాలను అక్కడి అధికారులు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే.. కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ప్రశ్నలతో కూడిన ఫామ్స్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : పాకిస్తాన్ రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుడు, సీసీటీవీ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

రష్యాలో మారిపోతున్న యువత ఆలోచలు, పెరిగిపోతున్న ఖర్చులు మరోవైపు.. పిల్లల్ని కనేందుకు ఆటంకాలుగా ఉన్నాయి. కానీ.. వాటికంటే ప్రస్తుత యుద్ధం ఆ దేశ యువతరాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. యుద్ధంలో వేల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోతుండడంతో.. వారి కుటుంబాలు అనాథలుగా మారిపోవడం, ఆయా కుటుంబాల్లోని మహిళలు మరింత మంది పిల్లల్ని కనే అవకాశం కోల్పోతున్నారు. రష్యా అధికారిక గణాంకాలు ప్రకారం.. 2024 జనవరి నుంచి జూన్ మధ్యలోనే 3 లక్షల 25 వేల మందికి పైగా మరణించారు. ఇందులో సహజ మరణాలు, ఇతర మరణాలు కూడా ఉంటుండగా.. యుద్ధంలో మరణించిన వారి సంఖ్యా ఎక్కువ శాతమే అంటున్నారు. అలాగే.. ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో అక్కడ 6 లక్షల మంది పిల్లలు జన్మించగా, క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 16 వేలకు పైగానే తక్కువంటున్నారు. అయితే.. ఈ సమస్య 1999 నుంచి ఉందంటున్నారు.. అధికారులు. ఈ సమస్యను కొద్ది మేర అక్కడికి వలస వచ్చిన వారి జనాభా తీరుస్తుంది.

పిల్లల్ని కనండి.. పురస్కారం పొందండి.

ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రోత్సహించేందుకు రష్యా.. పాతకాలం నాటి ఓ పురస్కారాన్ని మళ్లీ అమల్లోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం.. ఎవరైతే మహిళ.. 10 మంది, అంతకంటే ఎక్కువ మందిని కంటారో.. వారికి మదర్ హీరోయిన్ అనే అవార్డు కింద ఒక మిలియన్‌ రూబెల్స్‌ అంటే దాదాపు రూ.13లక్షలకు పైగానే నగదు పురస్కారం ఇవ్వనుంది. అయితే.. ఇందులోని కొన్ని నిబంధనల కారణంగా.. ఎవరూ పెద్దగా మొగ్గు చూపడం లేదు ఉంటున్నారు.. అక్కడి అధికారులు. పుతిన్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా.. 10 మందిని కంటే, పురస్కారం మాత్రం చివరి సంతానం కలిగిన తర్వాత ఇస్తామంటున్నారు. పైగా.. అప్పటి వరకు మిగతా తొమ్మిది మందిలో ఎవరూ మరణించకూడదని అంటున్నారు. ఈ కారణంగా.. పది మంది కనే వరకు వారి పోషణ భారాన్ని కుటుంబం చూసుకోవడం కష్టమవుతుందని అంటున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×