Pakistan Bomb Blast CCTv Video: పొరుగు దేశం పాకిస్థాన్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. బలూచిస్తాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్ లో బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో ఏకంగా 24 మంది దుర్మరణం పాలయ్యారు. 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుడు ఘటన జరిగే సమయంలో క్వెట్టా నుంచి పెషావర్ కు వెళ్లే రైలు ఫ్లాట్ ఫారమ్ మీదే ఉంది. పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు రైలు కోసం ఎదురు చూస్తుండగా ఈ ఘోరం జరిగింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాంబు పేలుడు వీడియో
క్వెట్టా రైల్వే స్టేషన్ పేలుడుకు సంబంధించి వీడియో తాజాగా అధికారులు విడుదల చేశారు. పొద్దున్నే 9 గంటల ప్రాంతంలో ఫ్లాట్ ఫారమ్ మీద పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ఉన్న సమయంలో ఈ పేలుడు జరిగింది. బాంబు దాడి దాటికి ప్లాట్ ఫారమ్ పరిసరాలు ధ్వంసం అయ్యాయి. రైల్వే స్టేషన్ పైకప్పు కుప్పకూలింది. ప్రయాణీకులు ముక్కలు ముక్కలై చెల్లాచెదురుగా పడిపోయారు. సంఘటనా స్థలం అంతా హృదయవిదారకంగా మారిపోయింది. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణీలకులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ బాంబు పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన చూసి నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
‼️ MOMENT OF RAILWAY BLAST IN QUETTA, 🇵🇰 BALOCHISTAN 👇
बलूचिस्तान के क्वेटा शहर में रेलवे विस्फोट का क्षण
Video credit: social media https://t.co/bGjw5ryBkh pic.twitter.com/KqJroBZVhv
— Sputnik India (@Sputnik_India) November 9, 2024
⚡️BREAKING NEWS: Blast on Railway Kills at Least 20 in 🇵🇰 Quetta
पाकिस्तान के क्वेटा में रेलवे पर विस्फोट में कम से कम 20 लोगों की मौत
पाकिस्तानी मीडिया के अनुसार, इस विस्फोट में लगभग 30 लोग घायल हो गए।
Videos from social media pic.twitter.com/21ZJ6AFq9d
— Sputnik India (@Sputnik_India) November 9, 2024
ఆత్మాహుతి దాడిగా భావిస్తున్న పోలీసులు
ఈ పేలుడుకు సంబంధించి క్వెట్టా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ మహ్మద్ బలోచ్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఘటనను ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నట్లు చెప్పారు. విచారణలో పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటపడుతాయన్నారు. పేలుడు స్వభావాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ పేలుడు జరిగిన సమయంలో అక్కడ సుమారు 100 మందికి పైగా ఉన్నట్లు వెల్లడించారు. క్వెట్టా నుంచి రావల్పిండికి వెళ్లేందుకు ప్రయాణీకులు రైలు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ బాంబు పేలిందన్నారు. చనిపోయిన వారిలో సుమారు 14 మంది ఆర్మీ సిబ్బంది ఉన్నట్లు తెలిపారు.
బాంబు దాడికి బాధ్యులు ఎవరు?
క్వెట్టా రైల్వే స్టేషన్ లో బాంబు దాడికి పాల్పడింది తామేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) తీవ్రవాద సంస్థ ప్రకటించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బలుచిస్తాన్ ప్రావిన్స్ అభివృద్ధిని విస్మరిస్తూ, అక్కడి వనరులను పాకిస్తాన్ దోడిపీకి పాల్పడుతున్న కారణంగానే ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించింది. ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. విధ్వంసానికి పాల్పడేందుకు విదేశీ శక్తులు అసంతృప్త అంశాలను తారుమారు చేస్తున్నాయని ఆరోపించింది.
పాక్ లో గత కొంతకాలంగా పెరుగుతున్న బాంబు దాడులు
గత కొద్ది కాలంగా పాక్ లో బాంబు పేలుడు ఘటనలు ఎక్కువయ్యాయి. రీసెంట్ గా ఉత్తర వజీరిస్థాన్ లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో నలుగురు ఆర్మీ జవాన్లు చనిపోయారు. మరికొంత మంది గాయపడ్డారు. బలూచిస్థాన్ లోని ఓ స్కూల్ సమీపంలో ఓ బాంబు పేలగా, ఐదుగురు స్కూల్ విద్యార్థులు సహా ఏడుగురు చనిపోయారు. తాజాగా క్వెట్టా రైల్వే స్టేషన్ లో ఘోరం జరిగింది.
Read Also: షిప్ లో జర్నీ చేస్తూ చనిపోతే.. డెడ్ బాడీని ఏం చేస్తారో తెలుసా?