BigTV English

IRCTC side berth Rules: రైలు సైడ్ లోయర్ బెర్త్‌ లో ఆ వైపు తిరిగి పడుకుంటున్నారా? చాలా తప్పు చేస్తున్నారు!

IRCTC side berth Rules: రైలు సైడ్ లోయర్ బెర్త్‌ లో ఆ వైపు తిరిగి పడుకుంటున్నారా? చాలా తప్పు చేస్తున్నారు!

Indian Railways: రైలు ప్రయాణంలో సైడ్ లోయర్ బెర్త్ తో బోలెడు లాభాలున్నాయి. వాటితో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇంతకీ సైడ్ లోయర్ బెర్త్ తో కలిగే లాభాలు, నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


సైడ్ లోయర్ బెర్త్ తో లాభాలు ఏంటి?

రైలు సీట్లలో సైడ్ లోయర్ బెర్త్ ఒకటి. రైల్లో ప్రయాణీంచే వారికి  సైడ్ లోయర్ బెర్త్‌  చక్కటి ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. సైడ్ బెర్త్‌ లో ప్రయాణించడం వల్ల కూర్చోవడానికి, పడుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఈ బెర్త్‌ లో కూర్చొని బయటి ప్రాంతాలను చూస్తూ వెళ్లొచ్చు. సైడ్ లోయర్ బెర్త్ రైలు కంపార్ట్‌ మెంట్ పక్కనే ఉంటుంది. ఈ సీట్లు AC, నాన్-AC కోచ్‌ లలో కనిపిస్తాయి. ఇతర బెర్తుల మాదిరిగా సైడ్ లోయర్ బెర్త్ సీట్లు ఎక్కాల్సిన అవసరం ఉండదు. ఇది పెద్దలు, పిల్లలు, వృద్ధులకు సులభంగా అందుబాటులో ఉంటుంది.


సైడ్ లోయర్ బెర్త్‌ ను ఎలా చెక్ చేసుకోవాలి?   

మీరు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే సైడ్ లోయర్ బెర్త్‌ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ సైడ్ లోయర్ బెర్త్ టికెట్ ఎలా పొందాలంటే?

⦿ ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ ఫారమ్స్: సైడ్ లోయర్ బెర్త్‌ సీట్ల లభ్యతను తనిఖీ చేయడానికి రెడ్‌ బస్ లాంటి రైలు టిక్కెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లను ఉపయోగించవచ్చు. రెడ్‌ బస్‌లో రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకునేటప్పుడు మీ ప్రయాణ వివరాలను ఫిల్ చేయాలి.

⦿ బెర్త్ ప్రాధాన్యత: బుకింగ్ చేస్తున్నప్పుడు.. బెర్త్ ప్రయారిటీ కేటగిరీలో ‘సైడ్ లోయర్ బెర్త్’ను ఎంచుకోవాలి.

⦿ లభ్యత తనిఖీ: వివరాలను ఫిల్ చేసిన తర్వాత, సిస్టమ్ సీట్ల లభ్యతను చూపుతుంది. సైడ్ లోయర్ బెర్త్ ఉంటే కేటాయిస్తారు. లేకపోతే అందుబాటులో ఉన్న ఇతర సీట్లను ఎంచుకోవచ్చు.

సైడ్ లోయర్ బెర్త్‌ లోతో కలిగే ప్రయోజనాలు

రైళ్లలో సైడ్ లోయర్ సీటులో ప్రయాణించడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ఈజీ యాక్సెసబులిటీ: సైడ్ లోయర్ బెర్త్ లో ప్రయాణించడం ఈజీ యాక్సెసబులిటీ కలుగుతుంది. నిచ్చెన, స్టెప్ సపోర్ట్ లేకుండా సులభంగా సీటుపై కూర్చోవచ్చు. తక్కువ సీటింగ్‌ ను ఇష్టపడే ప్రయాణీకులకు ఇది చాలా బాగుటుంది.

⦿ ప్రకృతిని ఆస్వాదించే అవకాశం: ఈ బెర్త్ లో కూర్చొనే ప్రయాణీకులు కిటికీ నుంచి బయటి ప్రాంతాలను చూస్తూ ప్రయాణం చేయవచ్చు.

⦿ ఫ్లెక్సిబిలిటీ: సైడ్ లోయర్ బెర్త్‌ ను సీటింగ్‌గా,  స్లీపింగ్ పొజిషన్‌లో సులభంగా మార్చుకోవచ్చు. పగలు,  రాత్రి సమయంలో సౌకర్యవంతంగా కూర్చోవడానికి,  నిద్రించడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

సైడ్ లోయర్ బెర్త్‌ మీద అలా పడుకోవద్దా?

రైలులో సైడ్ లోయర్ బెర్త్‌ లో చాలామందికి సరిగ్గా నిద్ర పట్టదు. ముఖ్యంగా తప్పు డైరెక్షన్‌లో నిద్రపోవడం వల్ల. ఔనండి.. మీరు నిద్రపోయే సైడ్ కూడా మీ సౌకర్యాన్ని డిసైట్ చేస్తుంది. మీకు సైడ్ లోయర్ బెర్త్‌ లో మంచిగా నిద్ర పట్టాలంటే.. మీ కాళ్లు ఇంజిన్ సైడ్‌కు ఉండేలా చూడాలి. అంటే మీరు కూర్చొనే పొజీషన్ ఇంజిన్ వైపు ఉండేలా చూసుకోవాలి.

Read Also: ఓడియమ్మ.. ఒకే రోజు 3 కోట్ల మంది రైలు ప్రయాణం, రైల్వే చరిత్రలోనే అరుదైన రికార్డు

Related News

Driverless Bus: హైదరాబాద్ విద్యార్థుల సరికొత్త ప్రయోగం.. దేశంలోనే ఫస్ట్ టైమ్.. డ్రైవర్ లెస్ బస్ రెడీ చేసేశారు!

FASTag Annual Pass: టోల్ రీచార్జ్ టెన్షన్‌కు గుడ్‌బై.. ఆగస్టు 15 నుంచి FASTag పాస్ రెడీ!

Srisailam Road Project: హైదరాబాద్‌ నుండి శ్రీశైలంకు కొత్త రూట్.. జస్ట్ 45 నిమిషాల్లో యమ స్పీడ్ దారి ఇదే!

Ganga Bridge: ఆసియాలోనే అద్భుతం.. 10 కి.మీ పొడవైన గంగా వంతెన.. ఇది వేరే లెవల్ బాస్!

Trains Cancelled: భారీ వర్షాలు.. పట్టాల మీదికి నీళ్లు, 5 రోజుల పాటు 10 రైళ్లు రద్దు!

Namo bharat Train: అది లోకల్ ట్రైన్ కాదురా అయ్యా, నమో భారత్!

Big Stories

×