BigTV English

Gold Cards USA : ట్రంప్ గోల్డ్ కార్డ్ సూపర్ హిట్ – ఒక్కరోజే 1000 కార్డులు విక్రయం

Gold Cards USA : ట్రంప్ గోల్డ్ కార్డ్ సూపర్ హిట్ – ఒక్కరోజే 1000 కార్డులు విక్రయం

Gold Cards USA : అక్రమ వలసదారుల్ని దేశం నుంచి తరిమేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. దేశంలోని రావాలనుకుంటే 5 మిలియన్ డాలర్ల విలువైన గోల్డెన్ కార్డులు కొనుగోలు చేసుకోవచ్చంటూ ఆఫర్ చేశారు. ఇప్పటి వరకు ఇంత విలువైన కార్డుల్ని ఎవరు కొంటారని అంతా భావించారు. కానీ.. అనూహ్యంగా అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఒకే రోజు ఏకంగా వెయ్యి మంది 5 మిలియన్ డాలర్లు చెల్లించి.. ఈ గోల్డెన్ కార్డులు కొనుగోలు చేశారు. దీంతో.. ఒకే రోజు అమెరికాలో నివాసం కోసం 5 బిలియన్ డాలర్లు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు చేరినట్లైంది.


అమెరికాకు భారంగా మారిన అక్రమ వలసల్ని ఒప్పుకోనంటూ తెగేసి చెప్పిన ట్రంప్.. 5 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.41 కోట్లకు పైగానే విలువైన గోల్డెన్ కార్డుల్ని ప్రవేశపెట్టి అందరినీ ఆశ్యర్చపరిచారు. కాగా.. ఇప్పుడు ఈ విధానం నెమ్మెదిగా ఫలితాల్ని ఇస్తుందని చెబుతున్నారు అక్కడి అధికార పార్టీ నాయకులు, మద్ధతుదారులు.

ట్రంప్ టార్గెట్ ఏంతో తెలుసా.?


అంతర్జాతీయంగా అమెరికా నిర్దేశించిన మొత్తం వెచ్చించి కార్డు కొనుగోలు చేసే శక్తి 37 మిలియన్ల మందికి పైగా ఉందని… ‘ఆల్-ఇన్ పాడ్‌కాస్ట్’లో మాట్లాడుతూ, అమెరికా వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ అభిప్రాయపడ్డారు. వారిలో ఒక మిలియన్ మందికి, అంటే పది లక్షల కార్డుల్ని విక్రయించగలిగినా.. అమెరికా 5 ట్రిలియన్ డాలర్లు సేకరించగలదని ట్రంప్ విశ్వసిస్తున్నారని తెలిపారు. అంతకు ముందు.. అంతర్జాతీయంగా వివిధ దేశాలకు చెందిన 2.5 లక్షల మంది ప్రజలు.. ట్రంప్ అమల్లోకి తీసుకువచ్చిన “గోల్డ్ కార్డులను” కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.

ఇలాంటి విధానమే గతంలోనూ అమెరికాలో అమల్లో ఉంది. అప్పుడు దీనిని EB-5 పెట్టుబడిదారు వీసాకు పిలుస్తుండే వారు. కానీ.. ట్రంప్ నూతన కార్డు ప్రవేశపెట్టడంతో ట్రంప్ కార్డు పేరుతో బాగా పావులర్ అయ్యింది. అయితే.. గోల్డ్ కార్డ్ లేదా ట్రంప్ కార్డ్ ను ప్రవేశపెట్టాలనే ఆలోచన ఎవరిది అని అమెరికా వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ ను అడిగితే.. ఇన్వెస్టర్ జాన్ పాల్సన్‌తో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ ఆలోచన చేశారని తెలిపారు.

వచ్చిన డబ్బుల్ని ఏం చేస్తారు

వాస్తవానికి అమెరికా ఎంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా కనిపిస్తుందో.. అంత పెద్ద మొత్తంలో రుణ భారాన్ని కూడా మోస్తుంది. ఈ రుణ భారాన్ని తగ్గించేందుకు డోనాల్డ్ ట్రంప్ అనేక తీరులుగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర దేశాలకు అందిస్తున్న సహాయాన్ని అపేయడం, అంతర్జాతీయ సంస్థలకు చేసే సాయాన్ని నిలిపివేయడంతో పాటుగా.. ప్రభుత్వ వృథా ఖర్చుల్ని సైతం భారీగానే నియంత్రిస్తున్నారు. ఇప్పుడు.. ఈ గోల్డెన్ కార్డుల విక్రయం ద్వారా వస్తున్న డబ్బును సైతం అమెరికా జాతీయ రుణాన్ని తీర్చడానికి ఉపయోగించనున్నట్లు తెలుపుతున్నారు.

2025 మార్చి నెలలో అమెరికా ప్రభుత్వ రుణం సుమారు 33 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇది ప్రపంచంలో అతి పెద్ద ప్రభుత్వ రుణంగా చెబుతున్నారు. ఈ రుణాన్ని తగ్గించేందుకు గోల్డెన్ కార్డు విక్రయాల ద్వారా వచ్చిన సొమ్ముల్ని విక్రయిస్తామని తెలిపారు. ట్రంప్ గోల్డ్ కార్డ్‌ను ప్రశంసిస్తున్నారని, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు బాగా ఉపయోగపడుతుందని ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కార్డును దానిని అప్‌గ్రేడ్ చేసిన గ్రీన్ కార్డ్‌తో ట్రంప్ పోల్చుతున్నారు.

Also Read : Migrants In US : ఆ నాలుగు దేశస్థులకు ట్రంప్ షాక్.. తక్షణమే దేశాన్ని విడవండి

గతంలో మీడియా సమావేశాల్లో మాట్లాడిన ట్రంప్ ఈ కార్డు కారణంగా.. అమెరికాలో స్థిరపడటానికి ఎక్కువ మంది ధనవంతులు గోల్డ్ కార్డులు కొనుగోలు చేస్తారని, అలా దేశంలో ఉద్యోగాలు, ఉపాధి పెరుగుతుందని అన్నారు. అలాగే.. ఈ కార్డును కొనుగోలు చేయడం ద్వారా ధనవంతులు దేశంలోకి వస్తారని, వారు వివిధ పెట్టుబడుల ద్వారా దేశాన్ని ధనికంగా మార్చేస్తారని చెబుతున్నారు. ధనవంతులు దేశంలో చాలా డబ్బు ఖర్చు చేస్తారని, వారంతా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో పన్నులు చెల్లిస్తారని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×