BigTV English

KKR VS RCB: దుమ్ములేపిన కోహ్లీ, సాల్ట్… RCB ఫస్ట్ విక్టరీ

KKR VS RCB:  దుమ్ములేపిన కోహ్లీ, సాల్ట్… RCB ఫస్ట్ విక్టరీ

KKR VS RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) మొదటి మ్యాచ్ లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు శుభారంభం చేసింది. మొదటి మ్యాచ్ లోనే విజయం సాధించి…. గుడ్ బిగినింగ్ అందుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు విరాట్ కోహ్లీ అలాగే ఫిలిప్ సాల్ట్ ఇద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించడంతో కేకేఆర్ జట్టుపై అవలీలగా విజయం సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. చేజింగ్ ఆరంభం నుంచి… రఫ్ ఆడించిన విరాట్ కోహ్లీ ( Virat Kohli ) అలాగే సాల్ట్ ( Philip Salt).. బెంగళూరును విజయతీరాలకు చేర్చారు.


Also Read: SRH vs RR: హైదరాబాద్‌ లో భారీ వర్షాలు… SRH తొలి మ్యాచ్‌ రద్దు ?

ఈ మ్యాచ్ లో ఏకంగా 7 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. చివరి వరకు ఆడిన కోహ్లీ… జట్టును విజయతీరాలకు చేర్చాడు. 22 బంతులు మిగిలి ఉండగానే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 59 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు కోహ్లీ.   ఇది ఇలా ఉండగా… అంతకు ముందు టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore team ) … మొదట బౌలింగ్ తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగానే బౌలర్లు కూడా అద్భుతంగా బౌల్ చేశారు. దీంతో కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు సొంత గడ్డపై కూడా పెద్దగా రాణించలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 174 పరుగులు మాత్రమే చేసింది కోల్కతా నైట్ రైడర్స్. టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ ప్లేయర్లు పెద్దగా రాణించకపోవడంతో.. తక్కువ స్కోరు చేసింది. కోల్కత్తా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders )  బ్యాటర్లలో సునీల్ నరైన్ 44 పరుగులు చేసి దుమ్ము లేపగా… కెప్టెన్ అజింక్య రహానే 56 పరుగులతో రాణించాడు.


Also Read: SRH vs RR: హైదరాబాద్‌ లో భారీ వర్షాలు… SRH తొలి మ్యాచ్‌ రద్దు ?

మిడిల్ ఆర్డర్లో కొత్త కుర్రాడు రఘువంశీ 30 పరుగులు టచ్ లోకి వచ్చాడు. కానీ చివరి వరకి రఘువంశి ఆడక పోవడంతో కేకేఆర్ తక్కువ పరుగులు చేసింది. అయితే డిపెండింగ్ ఛాంపియన్ కోల్కత్తా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders ) … పెట్టిన 175 పరుగుల లక్ష్యాన్ని… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అవలీలగా చేదించింది. ఏమాత్రం భయపడకుండా బ్యాటర్లు… కోల్కత్తా నైట్ రైడర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో మొదటి విక్టరీ నమోదు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నమెంట్లో ఏకంగా నాలుగు జట్లపై 1000కి పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించి రికార్డు లోకి ఎక్కాడు విరాట్ కోహ్లీ. కేకేఆర్ పైన… 1000 పరుగులు చేసుకొని ఈ రికార్డు సృష్టించాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్లపై 1000 కి పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఇవాళ కేకేఆర్ పై 1000 పరుగులు చేసుకున్నాడు. ఇలా నాలుగు జట్లపై వెయ్యికి పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్ గా గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

Related News

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Big Stories

×