Maranamass Glimps : ఇటీవల కాలంలో మలయాళ సినిమాలకు అన్ని భాషల్లోనూ మంచి క్రేజ్ పెరిగింది. ఫలితంగా కొంతమంది మలయాళ యంగ్ హీరోలు చేసే సినిమాలు మోస్ట్ అవెయిటింగ్ సినిమాల లిస్ట్ లో చేరిపోతున్నాయి. పైగా మలయాళ సినిమాలకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ పెరిగింది. ముఖ్యంగా యంగ్ హీరో బాసిల్ జోసెఫ్ (Basil Joseph) సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న అప్కమింగ్ మూవీ ‘మరాణా మాస్’ (Maranamass) లో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ గురించి విషయాన్ని స్వయంగా బాసిల్ జోసెఫ్ వెల్లడించారు.
టీచర్స్ స్టాఫ్ రూమ్ ను తగబెట్టేస్తాడు
‘మరాణా మాస్’ అనేది త్వరలో మలయాళంలో విడుదల కానున్న బ్లాక్ కామెడీ మూవీ. నూతన దర్శకుడు శివప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, మరో మలయాళ స్టార్ టోవినో థామస్ నిర్మించారు. ఈ చిత్రంలో బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో ఆయన ఒక ప్రత్యేకమైన, విచిత్రమైన ప్రవర్తన కలిగిన ‘సిగ్మా మేల్’ పాత్రను పోషించారు. ఈ మూవీలో ఇటీవల కాలంలో కేరళలో పెరుగుతున్న యూత్ నేరాలను ప్రస్తావించబోతున్నారు. ఈ తీవ్రమైన సమస్యను కామెడిగా తెరపై చూపించబోతున్నారు.
‘మరాణా మాస్ – సివిక్ సెన్స్’ అనే ప్రమోషనల్ వీడియోలో బాసిల్ జోసెఫ్ తన చిన్నప్పుడు టీచర్స్ స్టాఫ్ రూమ్ కు నిప్పు పెట్టడం చూడవచ్చు. దీనివల్ల స్కూల్ ను రెండు వారాల పాటు మూసేస్తారు. ఇంకేముంది ఆ స్కూల్ లో చదివే విద్యార్థులకు రెండు వారాలు ఎంచక్కా హాలిడేస్ వస్తాయన్న మాట.
సమ్మర్ కానుకగా ‘మరాణా మాస్’ రిలీజ్
ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను సిజు సన్నీ, దర్శకుడు శివప్రసాద్ కలిసి రాశారు. టోవినో థామస్ ప్రొడక్షన్స్, వరల్డ్ వైడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై నిర్మించారు. సినిమాటోగ్రాఫర్ గా నీరజ్ రేవి, జే ఉన్నితాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ‘మరాణా మాస్’ సినిమా విషు పండుగ సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది.
ఓటీటీలో ‘పొన్మన్’ సందడి
ఇదిలా ఉండగా, బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పొన్మన్’ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా స్టోరీ మొత్తం గోల్డ్ రికవరీ ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది. సినిమాలో హీరోయిన్ అన్న ఒక పొలిటికల్ పార్టీ కోసం పని చేస్తాడు. ఆ పార్టీకి సంబంధించిన పోస్టర్లను గోడ మీద అంటిస్తారు కొందరు. అది చూసిన చర్చ్ మనిషి దాన్ని చింపేస్తాడు. అప్పుడే హీరోయిన్ అన్న ఎంట్రీ ఇచ్చి, అతని చెంప పగలగొడతాడు. ఆ తరువాత పాస్టర్ స్వయంగా ఇంటికొచ్చి క్షమాపణ చెప్పమని అడిగినా చెప్పడు. మరోవైపు ఈ వ్యవహారంలో పార్టీ చేతులెత్తేస్తుంది. చెల్లి పెళ్లికి 25 కాసుల బంగారం అవసరం అవుతుంది. అలాంటి టైమ్ లో బంగారాన్ని అప్పుగా ఇచ్చి, వచ్చే కట్న కానుకల్లో ఆ డబ్బును తీసుకునే వ్యక్తిగా హీరో ఎంట్రీ ఇస్తాడు. పెళ్లయ్యాక హీరోయిన్ ఆ బంగారాన్ని ఇవ్వడానికి ఒప్పుకోదు. మరి హీరో తను ఇచ్చిన బంగారాన్ని ఎలా రికవరీ చేశాడు? అన్నది కథ.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">