E-Paper
Advertisement

America News: వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు.. ఉలిక్కిపడిన అధ్యక్షుడు ట్రంప్, ఇద్దరు సైనికుల పరిస్థితి

America News: వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు.. ఉలిక్కిపడిన అధ్యక్షుడు ట్రంప్, ఇద్దరు సైనికుల పరిస్థితి
Advertisement

America News: అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాషింగ్టన్‌ డీసీలో కాల్పుల కలకలం రేపింది. అమెరికా అధ్యక్షుడు భవనం వైట్‌హౌస్‌కు కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని అక్కడి పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అమెరికాలోని వైట్‌హౌస్ సమీపంలో కాల్పుల కలకలం

Advertisement

అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం అమెరికా అధ్యక్షుడి భవనం సమీపంలో కాల్పులు జరిగాయి. గుర్తు తెలియని ఓ వ్యక్తి నేషనల్‌ గార్డ్‌లపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మిగతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. అప్పటికే ఇద్దరు నేషనల్‌ గార్డ్‌లు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని అంబులెన్సులో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్ వెల్లడించారు. ఈ ఘటనతో బలగాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతడికి గాయాలు అయినట్లు స్థానిక మీడియా తెలిపింది.

Advertisement

ఇద్దరు గార్డ్స్ పరిస్థితి విషమం, ఉలిక్కిపడిన ట్రంప్

కాల్పులు జరిగిన ప్రాంతం వైట్‌హౌస్‌ పరిధిలోకి వస్తుంది. ఘటన తర్వాత యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌-ఇతర ఏజెన్సీల అధికారులు కాల్పులు జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. లోతుగా దర్యాప్తు మొదలుపెట్టాయి.  కాల్పుల ఘటన వైట్ హౌస్‌కు కూతవేటు దూరంలో జరిగినట్టు చెబుతున్నారు.

ఘటన జరిగిన వెంటనే దానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సైనికులలో సీపీఆర్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అందులో కనిపిస్తోంది. గాయపడిన మరో వ్యక్తికి చికిత్స అందిస్తున్న దృశ్యాలు అందులో కనిపించాయి. ఆ దారిలో గాజు పెంకులు భారీ ఎత్తున చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సైనికులలో ఒకరు ఆ దాడి చేసిన వ్యక్తిపై కాల్పులు జరిపారని, దాని కారణంగా అనుమానితుడికి గాయాలైనట్లు చెబుతున్నారు.

ALSO READ: భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 2 వేల అపార్ట్‌మెంట్స్

ఈ ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సైనికులపై కాల్పులు జరిపినవారు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. మన సైనికులు- భద్రతా సిబ్బందికి దేవుడు అండగా ఉండాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు సైనికులు సేఫ్‌గా ఉండాలని ప్రార్థించాలని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రజలను కోరారు.

గార్డ్స్‌ని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడని వాషింగ్టన్ మేయర్ మురియల్ పేర్కొన్నారు. నేరాలను అదుపు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం గత ఆగస్టులో నేషనల్ గార్డ్‌ను మోహరించింది. ఆనాటి నుంచి బలగాల మోహరింపుపై వివాదం మొదలైంది. ఈక్రమంలో దాడి జరగడం అనేక అనుమానాలు మొదలయ్యాయి.

కాల్పులు జరిపిన నిందితుడు ఆఫ్ఘన్‌ని చెందినవాడు. అతడ్ని రహ్మానుల్లా లకన్వాల్‌గా గుర్తించినట్లు అక్కడి మీడియా చెబుతోంది. నిందితుడి వయస్సు 29 ఏళ్లు ఉంటుంది. గడిచిన ఐదేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడట. ఇటీవల వీసా గడువు ముగిసినట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల ఘటనను ఉగ్రవాద చర్యగా పరిగణించి ఎఫ్‌బిఐ దర్యాప్తు చేస్తుందని అమెరికాకు చెందిన ఇద్దరు సీనియర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు.

నిందితుడు బైడెన్ హయాంలో ఐదేళ్ల కిందట అంటే 2021 సెప్టెంబర్ 8న ఆపరేషన్ అలైస్ వెల్కమ్ పేరిట అమెరికాలోకి ప్రవేశించాడని అక్కడి అధికారులు తెలిపారు.ఈ ఘటనపై యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ రియాక్ట్ అయ్యింది. భద్రతాపరమైన అంశాలను సమీక్షించే వరకు ఆఫ్ఘనిస్థాన్ వాసుల దరఖాస్తులను నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా ప్రజల భద్రత తమకు ముఖ్యమని తేల్చి చెప్పింది.

 

 

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×