BigTV English

Srikakulam student dies: అమెరికాలో శ్రీకాకుళం వాసి మృతి.. జార్జియాలేక్.. ఫోటోలు తీసే క్రమంలో..

Srikakulam student dies: అమెరికాలో శ్రీకాకుళం వాసి మృతి.. జార్జియాలేక్.. ఫోటోలు తీసే క్రమంలో..

Srikakulam student dies: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 26 ఏళ్ల దీపక్‌రెడ్డి మృతి చెందాడు. ఫోటో తీసుకోవడం కోసం ఓ లేక్ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో పట్టు తప్పి లేక్‌లో పడి మృతి చెందాడు. ఈ కేసును అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఉన్నత చదువుల కోసం ప్రతీ ఏటా భారతీయులు యువతీ యువకులు విదేశాలకు వెళ్తున్నారు.  అన్నింటి కంటే ముందు అమెరికా వైపు యువత మొగ్గు చూపుతుంది. అక్కడ ఎంఎస్ చేస్తే.. లైఫ్‌లో సెటిలైపోవచ్చని భావిస్తున్నారు. తల్లిదండ్రులు కష్టపడి తమ పిల్లలను అక్కడికి పంపిస్తున్నారు. వివిధ కారణాలతో ఇండియన్ స్టూడెంట్స్ అక్కడి మరణిస్తున్నవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.

తాజాగా ఉన్నత చదువుల కోసం ఎనిమిది నెలల కిందట అమెరికా వెళ్లాడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతానికి చెందిన పెదిని రూపక్‌రెడ్డి. పెన్సిల్వేనియాలోని హారిస్‌బర్గ్ యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంఎస్ చదువుతున్నాడు. డెల‌వేర్ ప్రాంతంలో ఉంటున్నాడు. మంగళవారం వర్సిటీలో క్లాసులు ముగించుకుని ఫ్రెండ్స్‌తో సమీపంలో ఉన్న జార్జియా లేక్ వద్దకు వెళ్లాడు.


ALSO READ: వార్ని, ఈ సంస్థ ఏకంగా సూర్యుడి కాంతినే అమ్మేస్తుందట.. రాత్రి వేళ ‘సన్ లైట్’ ఎలా సాధ్యం?

లేక్‌లో బోటుపై షికారు చేస్తూ మధ్యలో ఉన్న రాయిపై ఫ్రెండ్స్‌తో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రూపక్ బోటు నుంచి రాయిపైకి వెళ్లే క్రమంలో పట్టు కోల్పోయి లేక్‌లో పడిపోయాడు. ఫ్రెండ్స్ అతడ్ని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకోగానే రెస్క్యూ సిబ్బంది గాలించి రూపక్ మృతదేహాన్ని బయటకు తీశారు.

ఈ విషయాన్ని రూపక్‌రెడ్డి ఫ్రెండ్స్.. ఫ్యామిలీకి సమాచారం ఇచ్చారు. దీంతో రూపక్‌రెడ్డి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. చదువు కోసం విదేశాలకు వెళ్లి తమకు దుఖాన్ని మిగిల్చాడంటూ వాపోతున్నారు. రూపక్ మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని వేడుకుంటున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×