BigTV English

Actress Shriya Saran: కంగువా లో ఐటెం సాంగ్ చేస్తున్న శ్రియా శరణ్

Actress Shriya Saran: కంగువా లో ఐటెం సాంగ్ చేస్తున్న శ్రియా శరణ్

Actress Shriya Saran a special dance performanance in Kanguva movie: అందం, అభినయం అన్నీ సమపాళ్లలో ఉన్న నటి శ్రియా శరణ్.తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలలో నటించి అగ్ర హీరోల సరసన మెప్పించింది. 2021లో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దు గుమ్మ.తమిళం,బాలీవుడ్ లోనూ సినిమాలలో నటించి మెప్పించింది. అప్పట్లో డిస్నీ, హాట్ స్టార్ కలిసి నిర్వహించినవా షోటైమ్ వెబ్ సిరీస్ లనూ నటించింది. శివాజీ చిత్రంలో రజనీకాంత్ సరసన నటించి ఆ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. పెళ్లయి ఓ బిడ్డకు జన్మనిచ్చినా శ్రియా అందంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ హీరోయిన్ పాత్రలకు సై అంటోంది.


ఆర్ఆర్ఆర్ లో అతిథి పాత్ర

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ లో ఓ కీలక పాత్రలో మెరిచింది. సీనియర్ హీరోయిన్ అయినా నేటి యంగ్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తోంది. తనకు నచ్చిత చిన్నా పెద్దా క్యారెక్టర్ అని చూడదు శ్రియీ. శ్రియా సినీ పరిశ్రమకు వచ్చి దాదాపు 13 ఏళ్లు అవుతోంది. 41 సంవత్సరా వయసులోనూ బికినీ అందాలతో మతులు పోగొడుతోంది ఈ బ్యూటీ. ఇష్టం అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున తో కలిసి సంతోషం మూవీలో మెప్పించింది. తమిళ నటుడు సూర్య తమిళ నటుడే అయినా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు. సూర్య కు ఉన్న పాపులారిటీ ఒక్కసారిగా తెలుగులో వచ్చిన గజనీ మూవీతో పెరిగిపోయింది. రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత అదే రేంజ్ పాపులారిటీతో అటు తమిళ, ఇటు తెలుగు సినిమా రంగంలోనూ రాణిస్తున్నాడు. సూర్య సినిమా అంటే మినిమం గ్యారెంటీ కలెక్షన్స్ అని నిర్మాతల నమ్మకం.


సూర్య క్రేజ్

దాదాపు సూర్య నటించిన ప్రతి తమిళ మూవీ తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తుంటారు నిర్మాతలు . ఒకప్పుడు రజనీకాంత్,కమల్ హాసన్ సినిమాలే తెలుగులో అలా డబ్ చేసి వదిలేవారు. తర్వాత సూర్య కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే హీరో సూర్య లేటెస్ట్ గా రూ.350 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన కంగువా మూవీలో నటించారు. ఈ మధ్య వచ్చే పాన్ ఇండియా మూవీలు పఠాన్, జవాన్, కల్కి మూవీల తర్వాత వెయ్యి కోట్ల పై కన్నేశారు. అయితే కన్నడ సినిమాలు కేజీఎఫ్, కాంతారా వంటి సినిమాలు కూడా లాంగ్ రన్ లో ఇంచుమించు ఈ తరహా కలెక్షన్లు రాబట్టాయి. తమిళ మార్కెట్ ఈ విషయంలో కాస్త వెనకబడిందనే చెప్పాలి. రజనీకాంత్ జైలర్ మూవీ కూడా రూ.ఐదారొందల బడ్జెట్ వద్దే ఆగిపోయింది.

వెయ్యి కోట్ల టార్గెట్ తో కంగువా

అందుకే ఈ సారి ఎలాగైనా వెయ్యి కోట్ల టార్గెట్ తో వస్తున్నాడు హీరో సూర్య. ఇప్పటికే పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది కంగువా మూవీ. కోలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా రూపొందింది ఈ మూవీ. ఇప్పటికే రిలీజయిన టీజర్, ట్రైలర్లు ఈ మూవీపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రానికి హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్స్ కూడా తోడవడంతో అందరి దృష్టి ఇప్పుడు కంగువా పైనే ఉంది. అయితే ఈ మూవీని నవంబర్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ తమిళనాట దీపావళి సెంటిమెంట్ ఉండనే ఉంది. ఒకవేళ నవంబర్ కు చిత్రీకరణ పూర్తి కాకుంటే వచ్చే సంక్రాంతికైనా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు నిర్మాతలు. అవన్నీ పక్కన పెడితే ఈ మూవీలో ఓ ఐటెం సాంగ్ ని శ్రియా శరణ్ తో చేయించాలని అనుకుంటున్నట్లు కంగువా మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టడం విశేషం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×