BigTV English
Advertisement

Man sentenced: ఇంట్లో సీక్రెట్ కెమెరాలు.. భార్యని పట్టుకున్న భర్త.. కాకపోతే..

Man sentenced: ఇంట్లో సీక్రెట్ కెమెరాలు.. భార్యని పట్టుకున్న భర్త.. కాకపోతే..

Man sentenced: వారిద్దరు భార్యభర్తలు.. కొన్ని విషయాల్లో ఇద్దరి విబేధాలు పొడచూపాయి. రోజురోజుకూ తీవ్రమయ్యాయి. భార్యభర్తలు ఎడముఖం పెడముఖంగా వ్యవహరించారు. ఈ క్రమంలో భార్య అక్రమ సంబంధానికి తెర లేపింది. సీక్రెట్ కెమెరాల ద్వారా భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. చివరకు భర్త అడ్డంగా బుక్కయ్యాడు.. న్యాయస్థానం అతడికి మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఇదెలా సాధ్యమని భావిస్తున్నారా? అక్కడికే వెళ్దాం.


సంచలనం రేపిన ఈ ఘటన తైవాన్‌లో చోటు చేసుకుంది. తైవాన్‌కు చెందని ఫాక్స్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాఫీగా సాగుతున్న వీరి సంసారంలో ఒక్కసారిగా కలతలు మొదలయ్యాయి. రెండేళ్ల నుంచి వీరి కాపురంలో కలహాలు తారాస్థాయికి చేరాయి. మరి ఏం జరిగిందో తెలీదుగానీ భార్యపై ఫాక్స్‌కు అనుమానం వచ్చింది. భార్య వ్యవహారశైలిలో రోజురోజుకూ మార్పురావడం గమనించాడు.

భార్యకు ఏమైందని పలుపలు విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టాడు. సమస్య అంతుబట్టలేదు. ఓ వైపు కోపం, మరోవైపు భార్య.. ఏం చేయ్యాలో తెలియక సతమతమయ్యాడు. ఉద్యోగానికి వెళ్లినా చీటికి మాటికీ భార్య వ్యవహారం గుర్తుకు వచ్చేది. చివరకు ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టాలని భావించాడు.


ALSO READ: నేపాల్‌లో ఘోర ప్రమాదం, నదిలో పడిపోయిన బస్సు.. 40 మంది భారతీయులు

చేతిలో సెల్‌ఫోన్ గుర్తుకు వచ్చింది. వెంటనే బెడ్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టాలని నిర్ణయానికి వచ్చేశాడు. రూమ్‌లో కెమెరాలు ఫిక్స్ చేశాడు. రెండువారాల తర్వాత ఆ కెమెరాలను పరిశీలించాడు. కట్టుకున్న భార్య మరో వ్యక్తితో బెడ్రూమ్ మిడ్‌నైట్ మసాలా వ్యవహారం బయటపడింది. ఫాక్స్.. ఆ వీడియోలు చూపించి భార్యతో గొడవపడ్డాడు. భార్యభర్తల మధ్య గొడవ పెరుగుతుందోగానీ ఫుల్‌స్టాప్ పడలేదు.

భర్త ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, భార్య సహకరించలేదు. వేరే మార్గం లేకుండా పోయింది. చివరకు విడాకుల కోసం న్యాయస్థానం తలుపుతట్టాడు. ఈ క్రమంలో భార్య తన భర్తపై ఎదురుకేసు పెట్టింది. సీక్రెట్‌ కెమెరాలు పెట్టి తన గోప్యతను భర్త భంగం కలిగించాడంటూ రివర్స్ కేసు పెట్టింది. దీంతో విడాకుల కేసు కొత్త మలుపు తిరిగింది.

తన భార్య ప్రవర్తన వల్ల పిల్లలు ఆందోళన చెందారని, ఎక్కువ సేపు పడక గదిలో గడుపుతోందని వివరించాడు భర్త. అసలు పడక గదిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కెమెరాలు వినియోగించా నని న్యాయస్థానం ముందు అంగీకరించాడు. చివరకు న్యాయమూర్తి ఫాక్స్ వాదనను తోసిపుచ్చారు.

అనుమతి లేకుండా వ్యక్తిగత కార్యకలాపాలను చిత్రీకరించడం నేరమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ విషయంలో ఫాక్స్ చేసింది ముమ్మాటికీ తప్పుగా వర్ణించింది. అతడి వాదనను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. చివరకు ఫాక్స్‌కు మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఈ వ్యవహారం తైవాన్‌ మీడియాలో చర్చకు దారితీసింది. దీన్ని సమర్థిస్తున్నవాళ్లు లేకపోలేదు.. భార్య చేసిన వ్యవహారాన్ని తప్పుబట్టినవాళ్లు ఉన్నారు. చివరకు భార్యకు దూరంగా ఉండాలని భావించాడు.. అడ్డంగా బుక్కై జైలుకి వెళ్లాడు ఆమె భర్త ఫాక్స్.

Related News

Supermarket Explosion: సూపర్ మార్కెట్లో భారీ పేలుడు.. 23 మంది స్పాట్‌డెడ్

Kenya Landslide: విరిగిపడిన కొండ చరియలు.. 21 మంది మృతి

Newyork Airport: న్యూయార్క్ ఎయిర్ పోర్టులో తప్పిన ప్రమాదం.. ఆగివున్న విమానాన్ని ఢీకొన్న మరో విమానం

ISIS terrorist confess: పాక్ బట్టలిప్పిన టెర్రరిస్ట్.. ఐసీస్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారంటూ వాంగ్మూలం

Helicopter Crash: ఘోర ప్రమాదం.. కుప్ప కూలిన హెలికాఫ్టర్‌.. సోషల్ మీడియాల్ వీడియోలు వైరల్

US Nuclear Weapons: 33 ఏళ్ల తర్వాత అణ్వాయుధాలను బయటకు తీస్తున్న ట్రంప్ మామ.. ఎందుకంటే?

Trump Xi Jinping Meeting: జిన్ పింగ్ తో డొనాల్డ్ ట్రంప్ భేటీ.. టారిఫ్ లపై చైనాకు భారీ ఊరట

Nvidia: చరిత్ర సృష్టించిన ఎన్విడియా.. 5 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరిన తొలి కంపెనీగా రికార్డు

Big Stories

×