E-Paper
Advertisement

Temperature in China’s Xinjiang : షిన్‌జాంగ్.. ఫ్రీజింగ్

Temperature in China’s Xinjiang : షిన్‌జాంగ్.. ఫ్రీజింగ్
Advertisement

Temperature in China’s Xinjiang goes to -52 C : చైనాలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠానికి పడిపోతున్నాయి. 64 ఏళ్ల రికార్డులను సైతం చెరిపివేసింది డ్రాగన్ దేశంలోని శీతల వాతావరణం. ఎముకలు కొరికే చలికి పర్యాయంగా నిలిచింది షిన్‌జాంగ్.

అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 52.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. చైనాలోని ఇతర ప్రాంతాల్లోనూ అత్యంత శీతల పరిస్థితులు నెలకొనడంతో కొత్త సంవత్సరం వేడుకల సందడి తగ్గింది. మంచు తుఫాన్లు, మంచు వర్షాల వల్ల ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోతున్నారు. షిన్‌జాంగ్‌లో 1960లో మైనస్ 51.5 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. అదే ఇప్పటి వరకు అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత.

Advertisement

ఇప్పుడా రికార్డు సైతం చెరిగిపోయింది. కొన్ని రోజులుగా అతి శీతల వాతావరణం, మంచు కారణంగా ఆల్టయెలో 853 కిలోమీటర్ల మేర రహదారులపై రాకపోకలు స్తంభించాయి. రోడ్లపై మంచును తొలగించేందుకు 47 వాహనాలు, 86 మంది సిబ్బందితో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. ఫ్రీజింగ్ వెదర్ కారణంగా వాతావరణ శాఖ అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మంగోలియా, ఈశాన్య చైనా, హ్యుబె, హునాన్ ప్రావిన్సుల్లో మంచు విపరీతంగా కురుస్తోంది.

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×