BigTV English

Kishan Reddy: బీజేపీ విజయ సంకల్ప రథయాత్ర.. రేపటి నుంచి ప్రారంభం..

Kishan Reddy: బీజేపీ విజయ సంకల్ప రథయాత్ర.. రేపటి నుంచి ప్రారంభం..
BJP Kishan reddy latest news

BJP Kishan reddy latest news(TS today news): తెలంగాణ రాష్ట్రంలో విజయ సంకల్ప రథయాత్రకు బీజేపీ శ్రీకారం చుట్టనుంది. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విజయ సంకల్ప రథయాత్రను ప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ చేపట్టబోయే విజయ సంకల్ప యాత్ర వివరాలు వెల్లడించారు.


మంగళవారం నుంచి విజయ సంకల్ప రథ యాత్ర ప్రారంభం కానుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. రేపు నాలుగు యాత్రలు ప్రారంభం కానున్నాయన్నారు .కోమరంభీం యాత్ర బాసర సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో యాత్రం ప్రారంభం అవుతుందని తెలిపారు. రాజరాజేశ్వరీ విజయ సంకల్ప యాత్ర కరీం నగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల నాలుగు పార్లమెంట్ స్థానాలను కవర్ చేస్తూ యాత్ర కొనసాగనున్నట్లు వెల్లడించారు. ఇందులో 22 అసెంబ్లీలు కవర్ చేయనున్నామన్నారు. మిగిలిన నియోజక వర్గాలను సైతం కవర్ చేసేందుకు కృషి చేస్తామన్నారు. భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర.. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదంతో ప్రారంభం అవుతుందన్నారు. భువనగిరి , మల్కాజ్‌గిరి హైదరాబాద్ , సికింద్రాబాద్ కవర్ చేస్తూ.. యాత్ర కొనసాగనున్నట్లు ఆయన వెల్లడించారు.

కృష్ణ విజయ సంకల్ప యాత్ర మక్తల్ లో కృష్ణ గ్రామం నుంచి ప్రారంభం కానుందని కిషన్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ కవర్ చేస్తూయాత్ర కొనసాగుతుందన్నారు. కొమరం భీం యాత్రను అస్సాం సీఎం హేమంత్ బిస్వా శర్మ ప్రారంభిస్తారన్నారు. రాజరాజేశ్వరీ యాత్ర తాండూర్‌లో ప్రారంభం కానుందన్నారు. దీనికి కేంద్రమంత్రి బీఎల్‌ వర్మ హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు.


భాగ్యలక్ష్మీ యాత్రకి గోవా సీఎం ప్రమోద సావంత్‌ ముఖ్య అతిథిగా హాజరు అవుతారని కిషన్ రెడ్డి వెల్లడించారు. కృష్ణ యాత్రకు కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల హాజరవుతారన్నారు. యాత్రలో రోడ్ షో లు ఎక్కువ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఐదు యాత్రలు కలిపి 5500 కి.మీలు కవర్‌ కానుందని వెల్లడించారు. 114 అసెంబ్లీ కవర్ అయ్యేలా కవర్ యాత్ర ఉండనుంది. 106 రోడ్ షో లు ఉండనున్నాయి’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Tags

Related News

Pulivendula ZP: పులివెందుల జెడ్పీ.. ఆ ముగ్గురు వ్యూహం, బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్

Jagan: కూలిపోతున్న పులివెందుల కోట.. తప్పు ఎక్కడ జరిగింది? టెన్షన్‌లో జగన్‌

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

Big Stories

×