BigTV English

Chandrababu: పాపం చంద్రబాబు.. చీకట్లో 7 కి.మీ నడక.. చీకట్లోనే ప్రసంగం.. అనపర్తి అరాచకం

Chandrababu: పాపం చంద్రబాబు.. చీకట్లో 7 కి.మీ నడక.. చీకట్లోనే ప్రసంగం.. అనపర్తి అరాచకం

Chandrababu: చంద్రబాబుకు 72 ఏళ్లు. ఈ వయసులో ఏకంగా 7 కిలోమీటర్లు నడిచారు. కాదు కాదు, నడిపించారు. అవును, పోలీసుల తీరు వల్ల టీడీపీ అధినేత చీకట్లో.. సెల్ ఫోన్ వెలుతురులో.. 7 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. అంత ప్రయాస పడుతూ.. బలభద్రాపురం నుంచి అనపర్తికి చేరుకుంటే.. మళ్లీ అక్కడా కష్టాలే. కరెంట్ తీసేశారు. కార్యకర్తలు సెల్ ఫోన్ లైట్లు వేయగా.. ఆ వెలుగులో దేవిచౌక్ సెంటర్ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జగన్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. ఇంతకీ అసలేం జరిగిందంటే….


ఉదయం నుంచి హైడ్రామా. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మూడు రోజులుగా పర్యటిస్తున్నారు టీడీపీ అధినేత. అనపర్తిలో చంద్రబాబు సభకు గురువారం పర్మిషన్ ఇచ్చారు పోలీసులు. ఆ మేరకు స్థానిక నేతలు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, శుక్రవారం టీడీపీకి ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. పర్మిషన్ లేదంటూ, సభ వద్దంటూ హుకూం జారీ చేశారు. ఇప్పుడు చెబితే ఎలా? అంటూ టీడీపీ వర్గం నిలదీసింది. అయినా, పోలీసులు ససేమిరా అన్నారు. కార్యకర్తలు రాకుండా బారికేడ్లు పెట్టారు. పోలీసులు, తెలుగు తమ్ముళ్ల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఇదంతా అనపర్తి దేవిచౌక్ సెంటర్ దగ్గర సీన్.

అప్పటికింకా చంద్రబాబు దేవిచౌక్ కు చేరుకోలేదు. బాబు కాన్వాయ్ ను బలభద్రపురం దగ్గర పోలీసులు అపేశారు. రోడ్డుకు అడ్డంగా వాహనం పెట్టి, రోడ్డుపై అడ్డుగా బైఠాయించారు పోలీసులు. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఖాకీలు వెనక్కి తగ్గలేదు. చంద్రబాబు కాన్వాయ్ ని ముందుకు పోనివ్వలేదు. పోలీసుల తీరుకు నిరసనగా.. కారు దిగి, కాలినడకనే ముందుకు సాగారు చంద్రబాబు. చుట్టూ చీకటి. రోడ్డంతా గుంతలమయం. అయినా నడక కొనసాగించారు. 72 ఏళ్ల వయసులో అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగారు బహుదూరపు బాటసారిలా. కార్యకర్తలు సెల్ ఫోన్ లైట్స్ వేయగా.. ఆ వెలుతురులో ఏకంగా 7 కిలో మీటర్ల దూరం నడిచి.. అనపర్తి దేవిచౌక్ సెంటర్ కు చేరుకున్నారు. హమ్మయ్య వచ్చేసా.. అనే ఆనందం కూడా లేకుండా పోయింది. అంతలోనే మరో ఆటంకం.


చంద్రబాబు దేవిచౌక్ సెంటర్ లో మాట్లాడుతుండగా లైట్లు ఆపేశారు పోలీసులు. చంద్రబాబు చేతి నుంచి మైక్ లాగేసుకునే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు అడ్డుకున్నారు. చంద్రబాబు తగ్గేదేలే అన్నారు. మళ్లీ తమ్ముళ్లు సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేశారు. ఆ వెలుతురులోనే దేవిచౌక్ సెంటర్ సభలో మాట్లాడారు చంద్రబాబు.

‘‘ఎన్నో అవమానాలు భరించా. మీకోసం ఇంకా భరిస్తా. రాష్ట్ర భవిష్యత్‌ కోసం పోరాడుతున్నా. ఆ సైకో చెప్పినట్లు వింటే తర్వాత ఈ పోలీసులు నా దగ్గరే పనిచేయాలి గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పనులు చూసి ఆ యూనిఫామ్‌ సిగ్గుపడుతుంది. అనపర్తి నుంచి సహాయ నిరాకరణ ప్రారంభించా’’ అంటూ వీరావేశంతో ప్రసంగించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

అలా, ఎట్టకేళకు అనపర్తి సభ సక్సెస్ అయింది. చంద్రబాబు కమిట్ మెంట్ కి మరో నిదర్శనంగా మిగిలింది. తూర్పులో చంద్రబాబు మూడు రోజుల పర్యటన హైటెన్షన్ మధ్య ముగిసింది.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×