E-Paper
Advertisement

అమెరికా దిగ్బంధం ఎఫెక్ట్.. సముద్రంలోకి ఇరాన్ చమురు, ఖార్గ్‌ ఐలాండ్ చుట్టూ నల్లటి తెట్టు

అమెరికా దిగ్బంధం ఎఫెక్ట్.. సముద్రంలోకి ఇరాన్ చమురు,  ఖార్గ్‌ ఐలాండ్ చుట్టూ నల్లటి తెట్టు
Advertisement

Kharg Island: ఇరాన్‌ను తనదారిని తెచ్చుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది అమెరికా. యుద్ధం వల్ల తీవ్ర నష్టమని భావించిన అగ్రరాజ్యం, ఇరాన్ అష్టదిగ్భంధం చేసింది. ఫలితంగా ఉత్పత్తి చేస్తున్న చమురు నిల్వలు నిండిపోయాయి. ఫలితంగా సముద్రంలోకి చమురును వదిలేస్తోంది. ఉపగ్రహ చిత్రాల ద్వారా వీటిని గుర్తించారు.

అమెరికా దిగ్బంధం ఎఫెక్ట్.. మరొక కొత్త సమస్య

Advertisement

తన దారికి తెచ్చుకునేందుకు ఇరాన్‌లోని అన్నిపోర్టులను దిగ్భంధనం చేసింది అమెరికా. దీంతో ఆ దేశం వెలికి తీస్తున్న చమురు అమ్ముకోలేకపోతున్న దానిని సముద్రంలో పారబోస్తున్నట్లు తెలుస్తోంది. చమురు బావుల్లో ఉత్పత్తి నిలిపితే ఏమైనా సమస్యలు వస్తాయని భావిస్తోంది ఇరాన్. చమురు నిల్వలు నిండిపోవడంతో వాటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి ఉపగ్రహ చిత్రాలను విశ్లేషిస్తూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరాన్‌ చమురు ఎగుమతులకే కేరాఫ్ ఖార్గ్‌ ఐలాండ్. ఇప్పుడు ఆ ఐలాండ్ చట్టూ భారీగా నల్లటి తెట్టు తేలుతున్నట్టు కనిపించడం ఈ వార్తలకు బలం చేకూరింది. ఇరాన్ చమురు ఎగుమతులలో సుమారు 90 శాతం అక్కడి నుంచే జరుగుతాయి.

Advertisement

సముద్రంలోకి ఇరాన్ చమురు, ఖార్గ్‌ ఐలాండ్ చుట్టూ నల్లటి తెట్టు

ఆ చమురును హోర్ముజ్‌ మీదుగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటుంది. అదే సమయంలో కాల్పులకు విరమణ ప్రకటించాయి అమెరికా-ఇరాన్. అదే సమయంలో హోర్ముజ్‌ జలసంధిని మూసేసినా చమురు నౌకలను తరలిస్తూ వచ్చింది. ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు జలసంధి బయట గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్ ఏరియాలో అమెరికా నౌకా విభాగం దిగ్బంధం విధించింది.

ఆ చమురును హోర్ముజ్‌ మీదుగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటుంది. అదే సమయంలో కాల్పులకు విరమణ ప్రకటించాయి అమెరికా-ఇరాన్. అదే సమయంలో హోర్ముజ్‌ జలసంధిని మూసేసినా చమురు నౌకలను తరలిస్తూ వచ్చింది. ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు జలసంధి బయట గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్ ఏరియాలో అమెరికా నౌకా విభాగం దిగ్బంధం విధించింది.

ఇరాన్‌కు చెందిన చమురు నౌకలు ఏమీ బయటికి వెళ్లకుండా అడ్డుకోవడం మొదలైంది. దీంతో ఉత్పత్తి చేసిన చమురును వీలైనన్ని చోట్ల నిల్వ చేస్తూ వచ్చింది ఇరాన్. అవన్నీ నిండిపోవడంతో చమురును ఇరాన్‌ పర్షియన్‌ గల్ఫ్‌లో పారబోస్తూ ఉత్పత్తి చేస్తున్నట్లు వివిధ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

ALSO READ: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆత్మాహుతి దాడిలో 12 మంది జవాన్ల వీరమరణం

ఈ నేపథ్యంలో ఇరాన్ అత్యంత కీలకమైన ఇంధన ఎగుమతి కేంద్రంపై కొత్త ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఈ లీక్‌కు గల కారణం అస్పష్టంగా ఉన్నాయి. ఖార్గ్ ద్వీపం లోని మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా గతంలో దాడులు చేసింది. ఈ లీక్‌ను గుర్తించడానికి కొన్నివారాల ముందు ఏప్రిల్ ఆరంభంలోనే దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

నిల్వ ఉంచిన ముడి చమురు లీకేజీ ప్రమాదాలను పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు. అబుజర్ క్షేత్రానికి వెళ్లే పాత సముద్ర గర్భ పైప్‌లైన్‌లో సంభవించే పగుళ్లు దీనికి మరో కారణంగా చెబుతున్నారు. ఇరాన్ దేశ చమురు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది ఈ ప్రాంతం.

ఇక్కడి నుండి చైనా, ఆసియా దేశాల కొనుగోలు చేస్తాయి. అమెరికా దిగ్బంధనం కొనసాగితే ఇరాన్ ముడి చమురు నిల్వ సామర్థ్యం నిండుపోవచ్చని తాజా విశ్లేషణ సూచిస్తున్నాయి. ఖార్గ్ ద్వీపంలోని నిల్వలు కొద్ది రోజుల్లో పూర్తి సామర్థ్యానికి చేరుకోవచ్చని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నట్లు అల్-జజీరా ఛానెల్ నివేదించింది.

 

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Big Stories

Advertisement
×