BigTV English
Advertisement

USA: ఊడిన ఉద్యోగం.. ముగుస్తున్న వీసా గడువు.. టెన్షన్‌లో భారతీయ టెకీలు!

USA: ఊడిన ఉద్యోగం.. ముగుస్తున్న వీసా గడువు.. టెన్షన్‌లో భారతీయ టెకీలు!

USA: ఐటీ రంగంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం భారతీయ టెకీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికాలో ఉంటున్న వేలాది మంది భారతీయులు లేఆఫ్స్‌కు గురయ్యారు. కొత్త ఉద్యోగం దొరక్క.. వీసా గడువు ముగుస్తుండడంతో నానా తిప్పలు పడుతున్నారు. అక్కడే ఉండడం కోసం కొత్త దారులను అన్వేషిస్తున్నారు.


ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమ జాబ్‌ను కోల్పోయారు. అందులో 30 నుంచి 40 శాతం మంది భారతీయ టెకీలే. అమెరికాలోని టెక్ కంపెనీల్లో ఎక్కువ మంది ఉద్యోగులు భారతీయ వలసదారులే. అందుకే లేఆఫ్స్‌లోనూ ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు.

హెచ్-1బీ వీసాపై అమెరికాకు వెళ్లిన ఇండియన్ టెకీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జామ్ కోల్పోయిన వాళ్లు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగంలో చేరాలి. లేదంటే వీసా స్టేటస్‌ను మార్చుకోవాలి. రెండూ చెయ్యకపోతే గడువు ముగిసిన 10 రోజుల్లోగా అమెరికాను వదిలి వెళ్లిపోవాలి. దీంతో జాబ్ కోల్పోయిన టెకీలు నానా తంటాలు పడుతున్నారు.


హెచ్‌-1బీ వీసాపై అమెరికాలో ఉంటున్న భారతీయులకు టెక్ కంపెనీలు కొన్ని మినహాయింపులు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. వారి టర్మినేషన్ గడువును కొన్ని నెలలు పొడిగించాలని విన్నవించుకుంటున్నారు.

Related News

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Donald Trump: పాక్ అణ్వాయుధాలను టెస్ట్ చేస్తుందా? మళ్లీ యుద్ధం స్టార్ట్..!

America: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. పాక్-చైనా అణ్వాయుధ పరీక్షలు, వచ్చే ఏడాది కోసం గ్రౌండ్ ప్రిపేర్

Nepal Avalanche: నేపాల్ ఎవరెస్టు బేస్ క్యాంప్‌.. విరుచుకుపడిన హిమపాతం, ఏడుగురు మృతి

Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం.. 6.3 తీవ్రతతో అల్లకల్లోలం

Netherlands Next Prime Minister: నెదర్లాండ్ కు తొలి ‘గే’ ప్రధానమంత్రి.. ఎవరీ రాబ్ జెట్టెన్?

Big Stories

×