Netherlands Next Prime Minister: నెదర్లాండ్‌లో ఇటీవల ఎన్నికల్లో D66 సెంట్రీస్ పార్టీ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ చీఫ్ రాబ్ జెట్టెన్ (38) ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అతి చిన్న వయస్సులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న రాబ్ జెట్టెన్ తాను ‘గే’ అని బహిరంగంగానే ప్రకటించారు. రాబ్ జెట్టెన్‌కు అర్జెంటీనాకు చెందిన హాకీ ఆటగాడు నీకోలస్ కీనన్‌తో మూడేళ్ల క్రితం ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.
రాబ్ జెట్టెన్ డచ్ D66 సెంట్రిస్ట్ పార్టీ నెదర్లాండ్స్‌లో చరిత్ర సృష్టించబోతుంది. అక్టోబర్ 29న జరిగిన ఎన్నికల్లో రాబ్ జెట్టెన్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో 38 ఏళ్ల వయసులో గే ప్రధాన మంత్రిగా రాబ్ రికార్డు సృష్టించనున్నారు.
దేశం వెలుపల నివసిస్తున్న పౌరుల మెయిల్ ఇన్ బ్యాలెట్‌లను కూడా కౌంటింగ్ చేసిన తర్వాత నవంబర్ 3న అధికారిక ఫలితాలు విడుదల చేయనున్నారు. రెండేళ్లలో జెట్టెన్ తన పార్టీని ఐదో స్థానం నుంచి డచ్ రాజకీయాల్లో అగ్రస్థానానికి తీసుకెళ్లారు. జెట్టెన్ “హెట్ కాన్ వెల్” అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లారు. సానుకూల సందేశంతో ప్రచారం చేస్తే ప్రజాదరణ పొందగలమని యూరప్, మొత్తం ప్రపంచానికి చూపించామని జెట్టెన్ అన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా నెదర్లాండ్స్‌లో నెలకొన్న ప్రతికూలత అంశాలను ఎదురించి సానుకూల నినాదాలతో ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. నెదర్లాండ్స్ ను తిరిగి యూరప్ తో సత్సంబంధాలు కొనసాగించేలా చేస్తామన్నారు.
రాబ్ జెట్టెన్ నెదర్లాండ్స్ లోని ఉడెన్ పట్టణంలో పెరిగారు. అతడు నిజ్‌మెగెన్‌లోని రాడ్‌బౌడ్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అభ్యసించారు. రాబ్ కు ఫుట్‌బాల్, అథ్లెటిక్స్ అంటే ఇష్టం. అతని తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. తాను ప్రపంచాన్ని కొంచెం మెరుగైన ప్రదేశంగా మార్చాలనుకున్నానని రాబ్ తన విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌తో రాసుకున్నారు.
ముందుగా క్రీడలలో ఉన్నతస్థాయి ఉద్యోగం కోరుకున్న ఆయన.. ఆ తర్వాత క్యాటరింగ్ పరిశ్రమలోకి వెళ్లాలనుకున్నారు. సొంతంగా రెస్టారెంట్ పెట్టాలనుకున్నారు. కానీ విన్నంటికీ భిన్నంగా పరిస్థితులు మారిపోయాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ఇప్పుడు నెదర్లాండ్స్‌లో అత్యంత అందమైన ఉద్యోగం పొందనని ఇంటర్వ్యూలో చెప్పారు. జెట్టెన్ అర్జెంటీనా హాకీ ఆటగాడు నికోలస్ కీనన్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఏడాది స్పెయిన్‌లో అతడిని వివాహం చేసుకోనున్నారు.