Earthquake: ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూకంపం వచ్చిందని తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా మరో 150 మందికి పైగా గాయపడ్డారని చెబుతున్నారు. అయితే ఈ భూకంపం 23 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిదరి తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికి రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగిందని చెబుతున్నారు.
Also Read: లండన్ పర్యటనలో సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరీ
ఈ ఘటనలో పలు నివాసాలు కూలిపోయాయి. సమంగాన్, మజార్, నౌషాద్, తష్కుర్ఘాన్, ఖుల్మ్ ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు కనిపించాయి. కాబూల్-మజార్ రహదారి పలుచోట్ల ధ్వంసమైంది. తష్కుర్ఘాన్‌లో పలు వ్యాపార సముదాయాలు కూలిపోయాయి. ప్రాంప్ట్ అసెస్‌మెంట్ ఆఫ్ గ్లోబల్ ఎర్త్‌క్వేక్స్ ఫర్ రెస్పాన్స్ సిస్టమ్ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.