Nepal Avalanche: నేపాల్‌లోని యాలుంగ్ రి పర్వతంపై హిమపాతం విరుచుకుపడింది. ఈ ఘటనలో ఏకంగా ఏడుగురు పర్వతారోహకులు మృత్యువాతపడ్డారు. వారిలో ఐదుగురు విదేశీ అధిరోహకులు ఉన్నారు. మృతుల్లో ముగ్గురు ఫ్రెంచ్, ఒకరు కెనెడియన్, మరొకరు ఇటాలియన్, ఇద్దరు నేపాలీలు గైడ్‌లు ఉన్నారు. అసలు ఎక్కడ, ఎలా జరిగింది?
ఎవరెస్టు బేస్ క్యాంప్‌పై విరుచుకుపడిన హిమపాతం
తూర్పు నేపాల్‌లో యాలుంగ్ రి పర్వతంలోని అధిరోహకుల శిబిరంపై హిమపాతం ముంచెత్తింది. ఘటన సమయంలో పర్వతాన్ని 15 మంది సభ్యుల బృందం అధిరోహిస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు విదేశీయులు సహా కనీసం ఏడుగురు మరణించారు. 5,630 మీటర్ల (18,471 అడుగులు) ఎత్తున్న యాలుంగ్ రి పర్వతం.
దాని తర్వాత 20,774 అడుగుల ఎత్తైన డోల్మా ఖాంగ్ శిఖరాన్ని అధిరోహించడానికి ప్రయత్నించే క్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ యాత్రలో నలుగురు సభ్యులు సేఫ్‌గా ఉన్నారంటూ ఖాట్మండు పోస్ట్ మంగళవారం పేర్కొంది. గాయపడిన నలుగురు నేపాలీ పర్వతారోహకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో నలుగురు ఆచూకీ తెలియలేదని వెల్లడించింది.
హిమపాతానికి ఏడుగురు మృతి
గాయపడిన వారిలో ఒకరు న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు. సహాయం కోసం పిలిచామని, గంటల తరబడి వేచి చూసినా స్పందన రాలేదన్నారు. నాలుగు గంటల తర్వాత హెలికాప్టర్ వచ్చిందన్నారు. అప్పటికీ మా స్నేహితులు చాలా మంది వెళ్లిపోయారని తెలిపాడు. యాలుంగ్ రి పర్వతం ఈశాన్య నేపాల్‌లోని రోల్వాలింగ్ లోయలో ఉంది.
అక్కడికి వెళ్లిన అధిరోహకులు రాతి వేళ హిమపాతాన్ని ఎదుర్కుంటారు. విషాదానికి ముందు లోయలో నిరంతర మంచు కురుస్తోందని, వాతావరణ అనుకూలించని పరిస్థితులు నెల కొన్నాయి. ఓ వైపు భారీ హిమపాతం, మరోవైపు మేఘా వృతాల కారణంగా ఆ ప్రాంతంలో హెలికాప్టర్లు ఎగరలేకపోయాయి. సోమవారం సాయంత్రం నాటికి ఓ హెలికాఫ్టర్ ఆ ప్రాంతానికి చేరుకుందని పోలీసు అధికారి తెలిపారు.
ALSO READ: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. 6.3 తీవ్రతతో అల్లకల్లోలం
ప్రపంచంలోని 14 ఎత్తైన శిఖరాలలో ఎనిమిదింటికి నేపాల్ కేరాఫ్‌గా ఉంది. వాటిలో ఎవరెస్ట్ శిఖరం కూడా ఉంది. ప్రతి సంవత్సరం వందలాది మంది అధిరోహకులు, ట్రెక్కర్లు ఇక్కడకు వస్తుంటారు. గత వారం మొంథా తుపాను కారణంగా నేపాల్ అంతటా భారీ వర్షం కురిసింది. దీనివల్ల ట్రెక్కర్లు, పర్యాటకులు వివిధ మార్గాల్లో చిక్కుకుపోయారు.
నేపాల్‌లో రాజకీయ అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ అధిరోహకులు అవేమీ పట్టించుకోలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ నుండి ఇప్పటివరకు 1,450 మంది అధిరోహకులకు అనుమతులు మంజూరు చేసింది నేపాల్ పర్యాటక శాఖ. వారంతా 83 దేశాల నుండి వచ్చారు. దశాబ్దకాలంలో ఇంతమంది రావడం ఇదే అత్యధికం.