E-Paper
Advertisement

రిష‌బ్ పంత్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌, వాడికి రూ.27 కోట్లు దండ‌గే..గ్రౌండ్ లోనే సంజీవ్‌ గోయెంకా తాండ‌వం

రిష‌బ్ పంత్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌, వాడికి రూ.27 కోట్లు దండ‌గే..గ్రౌండ్ లోనే సంజీవ్‌ గోయెంకా తాండ‌వం
Advertisement

Sanjiv Goenka:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League Tournament 2026) నేపథ్యంలో తొలి మ్యాచ్ లోనే దారుణంగా ఓడిపోయింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా లక్నో వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Lucknow Super Giants vs Delhi Capitals) మధ్య నిన్న లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బీహార్ వాజ్పేయి క్రికెట్ స్టేడియం వేదికగా బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఇందులో గెలవాల్సిన మ్యాచ్ ను చేజేతులా పోగొట్టుకుంది లక్నో. ఢిల్లీ చేతిలో ఏకంగా ఆరు వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది. అయితే లక్నో ఓడిపోయిన నేపథ్యంలో కెప్టెన్ రిషబ్ పంత్ ను ( Rishabh Pant) ఓనర్ సంజీవ్ గోయెంకా ( LSG owner Sanjiv Goenka) బండ బూతులు తిట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో కేఎల్ రాహుల్ ను స్టేడియం బౌండరీ గేటు దగ్గర బహిరంగంగానే నిలదీశారు సంజీవ్ గోయెంకా. తాజాగా రిషబ్ పంత్ కు అదే పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Adam Zampa: ఐపీఎల్ అంటేనే న‌ర‌కం, డ‌బ్బులు కూడా స‌రిగ్గా ఇవ్వ‌రు..అందుకే పారిపోయి పాకిస్తాన్‌ వ‌చ్చా

కేఎల్ రాహుల్ త‌ర‌హాలోనే రిష‌బ్ పంత్ ను క‌డిగిపారేసిన సంజీవ్

Advertisement

 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఢిల్లీ వర్సెస్ లక్నో మధ్య అయిదవ మ్యాచ్ జరిగింది. ఇందులో లక్నో చివరి వరకు పోరాడి ఓడిపోయింది. అయితే ఈ ఓటమిపై లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా శివతాండవం చేశారు. మ్యాచ్ పూర్తి కాగానే బౌండరీ గేటు దగ్గర కెప్టెన్ రిషబ్ పంత్ ను అడ్డంగా నిలదీశారు. గెలిచే మ్యాచ్ ఎందుకు ఓడిపోయాం.. దానిమీద ఆన్సర్ చెప్పు అంటూ గట్టిగా నిలదీసినట్లు తెలుస్తోంది. నీకు రూ. 27 కోట్లు పెట్టి దండగ అన్న రేంజ్ లో క్లాస్ పీకారు లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా. ఇక అందరి ముందు సంజీవ్ గోయెంకా నిలదీసిన నేపథ్యంలో చాలా ఇబ్బందిగానే రిషబ్ పంత్ ఆన్సర్ ఇచ్చినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అయిన‌ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. సంజీవ్ గోయెంకా గాడిని ఐపీఎల్ లో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

వరుసగా విఫలమవుతున్న రిషబ్ పంత్

Advertisement

ఎప్పుడైతే రూ.27 కోట్లు పలికాడో అప్పటినుంచి రిషబ్ పంత్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో కెప్టెన్ గా, బ్యాటర్ గా లక్నో తరుపున పెద్దగా రాణించడం లేదు రిషబ్ పంత్. నిన్న ఓపెనర్ గా వచ్చి అనవసరంగా రనౌట్ అయ్యాడు. సరైన సమయంలో బౌలర్లను వినియోగించుకోకపోవడంతో నిన్న మ్యాచ్ కోల్పోయాడు. దీంతో రిషబ్ పంత్ వ్యవహారంపై అతని అభిమానులు కూడా చాలా సీరియస్ అవుతున్నారు. కాగా నిన్నటి మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ల‌క్నో 141 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 17.1 లో చేదించింది ఢిల్లీ క్యాపిటల్స్.

 

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ 15 కాదు, 25 ఏళ్లు ఉంటాడు.. లేక‌పోతే క‌ట్ డ్రాయ‌ర్ పైన తిరుగుతా

 

 

?igsh=dXJzbXAydWZzemdq

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×