E-Paper
Advertisement

ట్రంప్ ఆసక్తికర ప్రకటన.. అందుకే ఇరాన్‌పై దాడి వాయిదా, మళ్లీ ఏం జరిగింది?

ట్రంప్ ఆసక్తికర ప్రకటన.. అందుకే ఇరాన్‌పై దాడి వాయిదా, మళ్లీ ఏం జరిగింది?
Advertisement

America: అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్‌పై గేమ్ కంటిన్యూ చేస్తున్నారా? దాడి విషయంలో ఎందుకు దాడుగు మూతలు ఆడుతున్నారా? త్వరలో దాడి చేస్తున్నామంటూ ఒకరు.. వాయిదా వేస్తున్న మరోసారి ప్రకటనలు వివిధ దేశాలకు తలనొప్పిగా మారిందా? ఈసారి ఎందుకు ట్రంప్ మనసు మార్చుకున్నారు? ఇవే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

ఇరాన్‌పై అమెరికా సైనిక దాడి వాయిదా, మళ్లీ ఏం జరిగింది?

Advertisement

ఇరాన్‌పై చేపట్టనున్న సైనిక దాడిని వాయిదా వేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ విషయంలో గల్ఫ్ దేశాల నేతల విజ్ఞప్తి మేరకు ఆ దేశానికి కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. యుద్ధం కొనసాగించకుండా చర్చలను కొనసాగించాలని ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకులు కోరినట్టు తెలిపారు.

ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి ఇరాన్‌పై జరగాల్సిన దాడిని వాయిదా వేసినట్టు తెలిపారు. ఏప్రిల్‌లో పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు ఇరాన్‌కు కొంత సమయం ఇచ్చినట్టు గతంలో చెప్పిన విషయం తెల్సిందే. సైనిక దాడిని వాయిదా విషయాన్ని తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా తెలియజేశారు అధ్యక్షుడు ట్రంప్.

Advertisement

ట్రంప్ ఆసక్తికర ప్రకటన.. గల్ఫ్ దేశాల నేతల విజ్ఞప్తి 

ఇరాన్‌పై సైనిక దాడిని వాయిదా వేశామని, సంతృప్తికరమైన ఒప్పందం కుదరకుంటే భారీ దాడికి అమెరికా సిద్ధంగా ఉందని ప్రస్తావించారు. ఏ క్షణమైనా దాడి చేసేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యాన్ని ఆదేశించామని పేర్కొన్నారు.  ఇరాన్ కొత్త శాంతి ప్రతిపాదన-పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాల నేపథ్యంలో దాడిని వాయిదా వేయాలని అధ్యక్షుడు నిర్ణయించినట్టు అమెరికా మీడియా వెల్లడించింది.

అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు, హోర్ముజ్ జలసంధి భద్రత, ఆంక్షల సడలింపులు వంటి అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకూడదన్న విషయంలో అమెరికా తన కఠిన వైఖరిని కొనసాగిస్తోందని తెలిపాయి.

ALSO READ: మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన.. బంగ్లాకు నేను వస్తున్నాను

ఈ నేపథ్యంలో మంగళవారం ఆసియా మార్కెట్లో చమురు ధరలు పడిపోయాయి. మధ్యప్రాచ్యంలో చమురు సరఫరా అంతరాయాలను తగ్గించడానికి రష్యా చమురుపై ఆంక్షల మినహాయింపును అమెరికా పొడిగించింది. ముడి చమురు ధరలు తగ్గడానికి ఇది కూడా ఓ కారణమైంది.

Related News

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

అమెరికాలో షాకింగ్ ఘటన.. నువ్వు ముస్లిమా అంటూ, భారతీయుడ్ని 15 సార్లు కత్తితో పొడిచి..

Big Stories

Advertisement
×