E-Paper
Advertisement

కోడూరు హైవేపై ఘోర ప్రమాదం.. మూడు వాహనాలు దగ్ధం!

కోడూరు హైవేపై ఘోర ప్రమాదం.. మూడు వాహనాలు దగ్ధం!
Advertisement

Railway Koduru: రైల్వే కోడూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలుపల్లి చెక్ పోస్ట్ వద్ద పట్టపగలే నడిరోడ్డుపై మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొని, మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి.

ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఒక ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ఇన్నోవా కారును మరో కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, చూస్తుండగానే మూడు వాహనాలు అగ్నికీలల్లో చిక్కుకుని పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

Advertisement

ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కాపాడి, మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంతో రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: 60 ఏళ్లలోనూ కాలేజ్ కుర్రాళ్లలా.. 120 ఏళ్లు బ్రతికేసే ‘హుంజా’ మనుషుల సీక్రెట్!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×