E-Paper
Advertisement

కెనడాలోనూ ఉన్మాదమే.. ప్రేయసిని చంపిన ఇండియన్ ప్రియుడు.. ఏం జరిగిందంటే?

కెనడాలోనూ ఉన్మాదమే.. ప్రేయసిని చంపిన ఇండియన్ ప్రియుడు.. ఏం జరిగిందంటే?
Advertisement

Canada Murder: కెనడాలో ఇటీవల హత్యకు గురైన 23 ఏళ్ల భారతీయ యువతికి సంబంధించిన కేసులో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. ఆమెతో సజీవనం చేస్తున్న భారత్ కు చెందిన యువకుడే ఆమె గొంతు నులిమి ప్రాణాలు తీసినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకొని.. హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. మరోవైపు బాధితురాలి మృతదేహాన్ని భారత్ లోని బంధువుల వద్దకు పంపేందుకు ఫండ్ రైజింగ్ ప్రక్రియను మెుదలుపెద్దగా పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి.

అసలేం జరిగిందంటే?

కెనడాలోని ఎడ్మంటన్ లో చదువుకుంటున్న పంజాబ్ కి చెందిన యువతి దమన్ ప్రీత్ కౌర్ (23).. ఈ నెల 9న అనుమానస్పద స్థితిలో గాయాలతో మంచంపై పడి ఉంది. ఎడ్మంటన్ పోలీసుల కథనం ప్రకారం.. జులై 9న సాయంత్రం సుమారు 6:44 గంటల ప్రాంతంలో వారికి ఫోన్ వచ్చింది. ఓ యువతిలో గాయాలతో స్పృహ లేకుండా ఇంట్లో పడి ఉందని సమాచారం అందింది. దీంతో సెల్వర్ బెర్రీలోని యువతి నివాసానికి వెళ్లిన సౌత్ ఈస్ట్ బ్రాంచ్ పెట్రోల్ సిబ్బంది.. ఆమెను హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు.

హత్యగా తేల్చిన పోస్టుమార్టం

Advertisement

మూడ్రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం దమన్ ప్రీత్ కౌర్.. జులై 12న ప్రాణాలు విడిచింది. జులై 14న వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టులో ఆమెది హత్యగా వైద్యులు నిర్దారించారు. గొంతు నులమడం వల్ల ఆమె మరణించిందని ధ్రువీకరించారు. అయితే అప్పటికే ఆమెతో కలిసి జీవిస్తున్న రితీశ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో.. అతడ్ని తమదైన శైలిలో ప్రశ్నించారు. అతడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రితీశ్ పై హత్య కేసు నమోదు చేశారు. మరోవైపు యువతి హత్యలో ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఎడ్మంటన్ పోలీసులు తెలిపారు.

Also Read: అస్సాం ప్రజలకు అండగా ఏపీ.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు!

మృతదేహం తరలింపునకు ఆర్థిక సాయం

Advertisement

ఇదిలా ఉంటే కౌర్ మృతదేహాన్ని పంజాబ్ లోని లుధియానా జిల్లా సామ్రాలా ప్రాంతంలో గల ఆమె కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు ‘గో ఫండ్ మీ’ ప్రచారం కెనడాలో ప్రారంభమైంది. ఇప్పటికే కొండంత విషాదంలో మునిగిపోయిన కౌర్ కుటుంబానికి మృతదేహం తరలింపు, అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ తయారీ, అంత్యక్రియల ఏర్పాట్ల ఖర్చులు భరించలేనంత భారంగా మారాయని ఫండ్ రైజర్లు పేర్కొంటున్నారు. కాబట్టి కెనడాలోని భారతీయులు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేయాలని పిలుపునిచ్చారు. మెుత్తం 20 వేల డాలర్ల లక్ష్యంతో ఫండ్ రైజ్ ను ప్రారంభించగా ఇప్పటివరకూ 19 వేల డాలర్లు విరాళంగా రావడం విశేషం. దీంతో భారత్ కు ఆమె మృతదేహాన్ని తరలించే ప్రక్రియను ఫండ్ రైజర్లు వేగవంతం చేశారు.

Also Read: ప్రధాన్ రాజీనామా చేయకున్నా దీక్ష విరమణ ఎందుకు? సోనమ్ వాంగ్‌చుక్ ఆన్సర్ ఇదే!

Related News

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. మానవుల మూత్రం వల్ల అతిపెద్ద ముప్పు? పరిశోధనలో కొత్త విషయాలు

మిస్‌‌ వరల్డ్‌‌-2026 పోటీలు.. జోహెరి మెలాకు ప్రపంచ సుందరి కిరీటం, వియత్నాంలో అంగరంగ..

వివాహంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి, కాంగోలో ఘటన

ఆఫ్రికా పెరిగింది, అమెరికా అలిగింది.. కొత్త ప్రపంచ పటానికి UN ఆమోదం

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

Big Stories

Advertisement
×