E-Paper
Advertisement

సిరియాలో ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, 35 మంది మృతి, 30 మందికి పైగానే గాయాలు

సిరియాలో ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, 35 మంది మృతి, 30 మందికి పైగానే గాయాలు
Advertisement

Two buses collided: రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా రెండు బస్సులు ఢీ కొన్న ఘటనలో 35 మంది మృత్యువాతపడ్డారు. మరో డజను మందికి పైగానే గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత అక్కడి దృశ్యాలు భయానకంగా కనిపించారు.అసలు ఘటన ఎలా జరిగింది?

సిరియాలో ఘోర ప్రమాదం- సిరియాలోని తూర్పు-మధ్య ఎడారి ప్రాంతంలో అక్కడి కాలమానం ప్రకారం శనివారం రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 35 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రభుత్వ మీడియా తెలిపింది. డమాస్కస్-డెయిర్ ఎజోర్ రహదారిపై ఈ ఘటన జరిగింది. రెండు బస్సుల్లో దాదాపు 35 మంది చనిపోయారు. మరో 30 మంది గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement

రెండు బస్సులు ఢీ, 35 మంది మృతి- రెండు బస్సులు ఢీ కొన్న వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఊపిరి ఆడకపోవడంతో ఎక్కువ మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. రహదారి పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న శిథిలాల కనిపించాయి. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్సు అక్కడికి చేరుకున్నాయి. దాదాపు 30 మంది వరకు గాయపడ్డారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

30 మందికి పైగానే గాయాలు- ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం విషయం తెలియగానే బాధితుల బంధువులు ఆసుపత్రికి చేరుకుని ఆరా తీస్తున్నారు.  అతి వేగమే ఆ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానిక  అధికారులు వెల్లడించారు.

Advertisement

ఈనెల ఆరంభంలో దక్షిణ సిరియాలోని ఓ ప్రావిన్స్‌లో మరో ప్రమాదం జరిగింది.  సౌదీ అరేబియా నుండి యాత్రికులతో కూడిన బస్సు బోల్తా  పడింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, డజన్ల కొద్దీ ప్రయాణికులు గాయపడ్డారు. బాధితుల్లో ఎక్కువ మంది లెబనీయులు ఉన్నారు.

ALSO READ: కెనడాలోనూ ఉన్మాదమే.. ప్రేయసిని చంపిన ఇండియన్ ప్రియుడు.. ఏం జరిగిందంటే?

సంవత్సరాల సిరియా అంతర్యుద్ధం జరిగింది. వచ్చిన పాలకులు తమ సీట్లను కాపాడుకునే ప్రయత్నంలో అభివృద్ధిని నీరుగార్చారు. ఫలితంగా గతంలో ఉన్న మౌలిక సదుపాయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అనేక రహదారులకు డ్యామేజ్ అయ్యాయి, మరమ్మతులు చేయకపోవడంతో ప్రమాదాలు అక్కడ సామాన్యంగా మారిపోయాయి.

Related News

ప్రపంచ అధినేతల జీతాల లిస్ట్ ఇదే, సింగపూర్ ప్రధాని సాలరీ చూస్తే నోరెళ్లబెడతారు!

అమ్మబాబోయ్.. నూడుల్స్‌లో బతికున్న ఎలుక పిల్ల.. రెస్టారెంట్‌పై కేసు నమోదు!

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. మానవుల మూత్రం వల్ల అతిపెద్ద ముప్పు? పరిశోధనలో కొత్త విషయాలు

మిస్‌‌ వరల్డ్‌‌-2026 పోటీలు.. జోహెరి మెలాకు ప్రపంచ సుందరి కిరీటం, వియత్నాంలో అంగరంగ..

వివాహంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి, కాంగోలో ఘటన

ఆఫ్రికా పెరిగింది, అమెరికా అలిగింది.. కొత్త ప్రపంచ పటానికి UN ఆమోదం

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

Big Stories

Advertisement
×