భారత సైన్యం షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 124వ కోర్సు (అక్టోబర్ 2026) ప్రవేశాలకు సంబంధించి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సైన్యంలో ఆఫీసర్ హోదాలో దేశానికి సేవలందించాలనుకునే యువతకు ఇది గొప్ప అవకాశంగా నిలుస్తుంది.
ఈ కోర్సు కింద మొత్తం 76 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఎన్‌సీసీ పురుషుల విభాగానికి 70 పోస్టులు, మహిళల విభాగానికి 6 పోస్టులు కేటాయించారు. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లల కోసం రెండు విభాగాల్లోనూ కలిపి 8 పోస్టులు రిజర్వ్ అయ్యాయి.
ఖాళీల సంఖ్య: 76
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రస్తుతం లాస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అవుతారు.
విద్యార్హతలతో పాటు ఎన్‌సీసీ సీనియర్ డివిజన్ వింగ్‌లో మూడు అకడమిక్ సంవత్సరాల పాటు కొనసాగడం తప్పనిసరి. ఎన్‌సీసీ ‘సి’ సర్టిఫికెట్ పరీక్షలో కనీసం ‘బి’ గ్రేడ్ పొంది ఉండాలి. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల పిల్లలకు మాత్రం ఎన్‌సీసీ ‘సి’ సర్టిఫికెట్ నిబంధన నుంచి మినహాయింపు కల్పించారు.
వయోపరిమితి: 2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 19 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతుంది.
ముందుగా అభ్యర్థులు పంపిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు ఉంటాయి. వీటిలో ప్రతిభ కనబరిచిన వారికి ఎస్‌ఎస్‌బీ (SSB) ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తుది దశలో మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో 49 వారాల పాటు కఠినమైన శిక్షణ ఉంటుంది.
శిక్షణ కాలంలో అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్ అందిస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి మద్రాస్ యూనివర్సిటీ నుంచి ‘పీజీ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్’ డిగ్రీ లభిస్తుంది. వీరికి లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.
ముఖ్యమైన తేదీల వివరాలు:
మహిళల దరఖాస్తులు ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభమయ్యాయి. పురుషుల దరఖాస్తులు ఫిబ్రవరి 12 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 16వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
నోట్: దరఖాస్తుకు ఇంకా 3 రోజులే..
అప్లికేషన్ లింక్: https://joinindianarmy.nic.in/
ALSO READ: CBI Recruitment: నెలకు రూ.1,20,940 వరకు జీతం.. సీబీఐ నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్