E-Paper
Advertisement

Trump Christmas Offer: ట్రంప్ క్రిస్మస్ ఆఫర్.. అక్రమ వలసదారులకు ఊహించని గిఫ్ట్, ఎంతో తెలుసా?

Trump Christmas Offer: ట్రంప్ క్రిస్మస్ ఆఫర్..  అక్రమ వలసదారులకు ఊహించని గిఫ్ట్, ఎంతో తెలుసా?
Advertisement

Trump Christmas Offer: ట్రెండ్‌ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ దిట్ట. ఏదో విధంగా ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తుంటారు. క్రిస్మస్ నేపథ్యంలో ఆ దేశంలో అక్రమంగా ఉన్న వలసదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.  స్వదేశానికి వెళ్లేవారికి 3000 వేల డాలర్లు ఇస్తామంటూ ప్రకటన చేశారు.

Advertisement

అక్రమ వలసదారులకు ఊహించని కానుక

Advertisement

అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను వారివారి దేశాలకు పంపేందుకు రకరకాల ప్రణాళికలు అమలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ప్రభుత్వపరంగా ఇప్పటికే కొన్నింటిని అమలు చేశారు. దేశంలోకి వలసదారులు రాకుండా కఠినమైన ఆంక్షలు విధించారు. అయినా ఇంకా ఆ దేశంలో అక్రమంగా వలసదారులు ఉంటున్నారని ఆయన బలంగా నమ్ముతున్నారు.

క్రిస్మస్ నేపథ్యంలో అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు ట్రంప్. ఈ ఏడాది చివరిలోపు అమెరికా విడిచి వెళ్లేవారికి భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఈ ఏడాది చివరిలోగా దేశం విడిచి వెళ్లేవారికి 3,000 డాలర్లు ఇస్తామని ప్రకటన చేశారు. భారత కరెన్సీలో సుమారు రూ. 2.7 లక్షలు అన్నమాట. కేవలం నగదుతోపాటు ఉచితంగా విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.

ట్రంప్ క్రిస్మస్ ఆఫర్, ఎంతో తెలుసా?

మే నెలలో టీం ట్రంప్ ప్రకటించిన 1,000 డాలర్ల చెల్లింపు కంటే మూడు రెట్లు ఎక్కువ. ఈ విషయాన్ని అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం-DHS స్వయంగా వెల్లడించింది. ఈ ఆఫర్ కింద కొన్ని షరతులు విధించింది అమెరికా ప్రభుత్వం. ఈ పథకం ద్వారా దేశం విడిచి వెళ్లేవారికి విధించిన సివిల్ జరిమానాలు రద్దు చేయనున్నట్లు పేర్కొంది.

అందుకోసం వలసదారులు CBP హోమ్ యాప్‌ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాలి. యాప్‌ డౌన్‌లోడ్ చేసి సమాచారం నింపితే చాలు.  మిగతా ఏర్పాట్లను ప్రభుత్వం చూసుకుంటుందని DHS  ఓ ప్రకటనలో తెలియజేసింది.  ఈ ఆఫర్‌ను వినియోగించుకోనివారిపై కఠిన చర్యలు తప్పవని చెప్పకనే చెప్పింది.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే,  అలాంటివారిని గుర్తించి దేశం నుంచి బహిష్కరిస్తామని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ చెప్పారు. అలాంటి వారు మళ్లీ అమెరికాలోకి ఎప్పటికీ అడుగుపెట్టలేరని తేల్చిచెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 1.9 మిలియన్ల మంది అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా దేశం విడిచి పెట్టారు.

ALSO READ:  బంగ్లాలో హిందూ యువకుడు హత్య.. ఆ రాత్రి ఏం జరిగింది?

వేలాది మంది ఈ యాప్‌ ఉపయోగించారని తెలిపారు. ఏటా దేశంలో ఓ మిలియన్ అక్రమ వలసదారులను తొలగించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఐనప్పటికీ ఈ ఏడాది ఇప్పటివరకు 261,000 నుంచి 622,000 మందిని బహిష్కరించిందని అమెరికా ఏజెన్సీల నివేదికలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది2026 లో వారిపై మరింత దూకుడుగా వ్యవరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

అందుకోసం బిలియన్ డాలర్ల నిధులు ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. వేలాది మంది అదనపు ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లను నియమించడం, కొత్త నిర్బంధ కేంద్రాలను  ఏర్పాటు చేయడం, అక్రమవలస దారులను ట్రాక్ చేయడానికి ప్రైవేట్ కంపెనీలతో భాగస్వామ్యం వంటి ప్రణాళికలు ఉన్నాయని అంటున్నారు అక్కడి అధికారులు.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×